ఫోటో స్టోరి: ఒక రొమాంటిక్ ప్రేమ కథ

0సినిమాలో కనిపించే నటి నటులు ఒక్కోసారి చాలా క్లోజ్ గా కనిపించడం చుస్తే వారి మధ్య ప్రేమ ఉందా అని అనిపించకుండా ఉండదు. ఇప్పటివరకు చాలా ఇండస్ట్రీలలో స్టార్స్ పెళ్లి చేసుకున్నట్లు లెక్కలు చాలా ఉన్నాయి కానీ చివరి వరకు కలిసి ఉన్న నటులు మాత్రం చాలా తక్కువ. అపోహలు అజమాయిషీ అర్ధం చేసుకోకపోవడం అలాగే ఇతర చిన్న చిన్న కారణాలకే విడాకులు అనేస్తారు. సెలబ్రెటీల విషయంలోనే ఎక్కువగా అలా జరుగుతూ ఉంటాయని టాక్ ఉంది.

ఇకపోతే అలాంటి కామెంట్స్ అబద్దం అని చెప్పడానికి ఉదాహరణకు సైఫ్ అలీ ఖాన్ – కరీనా కపూర్ లను చెప్పుకోవచ్చు. ఈ జంట ఎంత ముచ్చటగా ఉంటుందో వారి గత ప్రేమ నుంచి ఇప్పుడు వస్తున్న పోటోలను చూస్తుంటే ఈజీగా అర్ధమవుతుంది. ఓ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యినా కూడా వారి ప్రేమలో ఏ మాత్రం మార్పులు రాలేదు. గతంలో డేటింగ్ అంటూ అనేక ప్రదేశాల్లో తిరిగారు. ఇక ఇప్పుడు కూడా వారి ఫెవెరెట్ హాలిడే స్పాట్ లండన్ కి వెళుతుంటారు. అలాగే పటౌడీ వెకేషన్స్ కూడా జరుగుతూనే ఉంటాయి.

ప్రస్తుతం కరీనా – సైఫ్ కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు అయితే ఆ ఫొటోలకు ఫిదా అయిపోతున్నారు. కరీనా చాలా క్యూట్ గా కనిపిస్తోంది. మళ్లీ వారి ప్రేమ నాటి గుర్తులను మరోసారి ఫ్రెష్ గా గుర్తు చెస్తూతున్నాయని నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఒక రొమాంటిక్ ప్రేమ కథ అన్నట్లు ఎన్నేళ్ళు గడిచినా కూడా వీరి లవ్ స్టోరీ భలే కొత్తగా స్వీటుగా ఉందంటున్నారు చూపరులు.