పటౌడీ క్వీన్ కరీనా కపూర్ ఎందులోనూ తగ్గదుగా..!

0

ఇటీవలే భర్త సైఫ్ ఖాన్ పుట్టినరోజు వేడుకల్లో బెబో కరీనా కపూర్ ఎంత సందడి చేసిందో చూశాం. సైఫీనా వేడుకలు నెటిజనులకు కన్నులపండుగనే తలపించాయి. 50 వయసు వచ్చేసిందోచ్! అంటూ భర్త గురించి ఓపెన్ గానే ప్రకటించేసి సర్ ప్రైజ్ చేసింది కరీనా.

ఈ వేడుకల్లో తన రెండవ గర్భం గురించి మరోసారి అభిమానులకు వెల్లడించింది బెబో. అయితే గర్భిణి అయినా కానీ .. కమర్షియల్ గా తన రెవెన్యూకి ఏమాత్రం డోఖా లేకుండా జాగ్రత్త పడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఫ్రెగ్నెంట్ ఉమెన్ రిస్ట్రిక్షన్స్ ఏవీ ఈ భామ పట్టించుకుంటున్నట్టే కనిపించడం లేదు.

కరోనా వైరస్ భయం అంతకంతకు పెరుగుతూ ఉన్నా..షూటింగుకి అటెండయ్యి షాకిచ్చింది బెబో. బాలీవుడ్ ఇప్పటికే తెగువ చూపిస్తున్న మాట నిజమే. ముంబైలో షూటింగులు మొదలయ్యాయి. ఇక కరీనా కపూర్ ఇప్పటికే సెట్స్లో చేరి ఒక యాడ్ షూట్ లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటో చూస్తుంటే .. పటౌడీ క్వీన్ ఎందులోనూ తగ్గదు కదా! అని అంతా కామెంట్లు పెడుతున్నారు. కరీనా కు అలంకరణ చేస్తూ అరడజను మంది సిబ్బంధి ఫోటోకి ఫోజులిచ్చారు. అయితే సెట్స్ లో అంతా మార్గదర్శకాలు పాటించారు. సిబ్బంది అందరూ సేఫ్టీ వస్త్రాలు ధరించి కనిపించారు. ఇక సినిమాల సంగతికి వస్తే అమీర్ ఖాన్ సరసన లాల్ సింగ్ చద్దా చిత్రంలో కరీనా నటిస్తోంది. తదుపరి వేరొక సినిమాని ప్రకటించనే లేదు.