మీట్ మిసెస్ ఘాటు కపూర్ గారు!

0

స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇవ్వడం సులువే కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ గా ఎదగడానికి మాత్రం కష్టపడడం తప్పనిసరి. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఒక స్టార్ కిడ్ లాగా ఎంట్రీ ఇచ్చింది కానీ తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న సమయంలో లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆరంభించింది.

వివాహం తర్వాత కొంతకాలం నటన కొనసాగించింది కానీ కొడుకు తైమూర్ అలీ ఖాన్ పుట్టిన తర్వాత మాత్రం రెండేళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తర్వాత ‘వీరే డి వెడ్డింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. వివాహం అయిందని.. ఓ బిడ్డకు అమ్మ అని గ్లామర్ కు దూరంగా ఉండే పాత చింతకాయ పచ్చడి వ్యవహారం కానే కాదు. అందుకే తన గ్లామర్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో మంటలు పెడుతూ ఈ తరం హీరోయిన్లకు సవాలు విసురుతూ ఉంటుంది. ఈమధ్య అలాగే ఓ సందర్భం గా ఓ ఫోటోకు పోజిచ్చింది. ఛోళి.. లెహెంగా ధరించి ట్రెడిషన్ లో ఫ్యాషన్ ను మిక్స్ చేసి అక్కడ ఉన్న అతిథులకు గ్లామర్ షాక్ ఇచ్చింది. సూపర్ గా స్టైలింగ్ చేసిన హెయిర్.. చక్కగా మేకప్ తో హాలీవుడ్ నటీమణి తరహాలో కనిపిస్తోంది. వర్క్ ఉన్న ఛోళికి ఓ భారీ వీ నెక్ ఉంది. ఆ డ్రెస్ కు సరిపోయే ఓ అందమైన నెక్లెస్ ధరించి మరీ తన అందాలను ఫుల్లుగా ధారపోసింది. నెక్లెస్ ఎంత అందంగా ఉన్నప్పటికీ చిలిపి నెటిజన్లు ఆ నెక్లెస్ ను చూడరుగా!

ఇలాంటి డ్రెస్సులు చూసినప్పుడే భారత దేశం ఏ విషయాల్లో ఎలా డెవలప్ అయినా కాకున్నా గ్లామర్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు అన్నయ్య లాగా తయారైందని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎవరైనా నమ్మకపోతే మలైకాలు పటానిలు తదితర ఘాటు భామల బ్యాచ్ పేర్లు వరసగా గుక్క తిప్పుకోకుండా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చదివినట్టు చదివితే సరి. ఇక కరీనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంగ్రేజీ మీడియమ్’ సినిమాలో కూడా నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-