భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

మమ్మీ గారు ఆ ఛాన్స్ ఒక్కరికే ఇస్తారట!

0

బెబో కరీనా కపూర్ ఖాన్ వారసుడు థైమూర్ అలీఖాన్ చిద్విలాసం తెలిసిందే. థైమూర్ రాకతో బెబో లైఫ్ బ్యాలెన్స్ డ్ గా ముందుకు సాగుతోంది. వారసుడే లోకంగా కరీనా జీవనం సాగుతోందంటే అతిశయోక్తి కాదు. తాజాగా కరీనా ఇచ్చిన స్టేట్ మెంట్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

“నా ఫ్రేమ్లోకి కేవలం ఒకే ఒక్కరిని అనుమతిస్తాను. ఇంకెవ్వరికీ ఆ ఛాన్స్ లేదు“ అని అంటోంది కరీనా కపూర్. ఇంతకి ఆ ఒక్కరు ఎవరు? అంటే… స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ అనుకుంటున్నారంతా. కానీ కరీనా ఛాన్స్ ఇచ్చేది ఆయనకు కాదట. తన గారాలపట్టీ తైమూర్ అలీ ఖాన్ కి ఆ ఛాన్సిస్తుందట. పుట్టుకతోనే సెలబ్రిటీ అయిపోయిన తైమూర్ ఇప్పుడు అందరి చూపులను తన వైపు తిప్పేసుకుంటున్నాడు. థైమూర్ క్యూట్ ఫోటోల్ని తరచూ సోషల్ మీడియాలో కరీనా షేర్ చేస్తూ తన హ్యాపీనెస్ ని పంచుకుంటోంది.
తాజాగా ఓ కొత్త ఫోటోని కరీనా అభిమానులతో పంచుకుని పై విధంగా స్పందించారు.

ఈ ఫోటోలో తైమూర్ ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంది. క్యూట్ బోయ్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాడో బ్యాక్ గ్రౌండ్లో కరీనా అంతే బ్లర్ అయ్యి కనిపిస్తోంది. ఇదో తరహా సినిమాటిక్ పిక్చరైజేషన్ తో ఉన్న ఫోటో. తైమూర్ ని ఎత్తుకుని మమ్మీ కరీనా ఎంతో ప్రేమను ఒలకబోస్తోంది. ఇక ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడంతో సంథింగ్ స్పెషల్ గా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత రెండో ఫోటోగా వెంటనే తైమూర్ తో దిగిన ఫోటోని పంచుకుంది. ఇదిలా ఉంటే సెలబ్రిటీలంతా చాలా రోజులుగా ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడో చేరి దూసుకుపోతుంటే.. కరీనా మాత్రం చాలా లేటుగా తేరుకున్నారు. ఇటీవలే తొలిసారి తన ఇన్ స్టాగ్రామ్ ని ఓపెన్ చేశారు. అయితే అకౌంట్ ఓపెన్ చేసిన 12 గంటల్లోనే వన్ మిలియన్స్ ఫాలోవర్స్ చేరడం విశేషం. ఇంత వేగంగా మిలియన్ ఫాలోవర్స్ చేరుకున్న తొలి భారతీయ నటిగా కరీనా రికార్డ్ సృష్టించారు కరీనా.

ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా వన్నె తరగని అందంతో అబ్బురపరుస్తున్న కరీనా ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటు ఇర్ఫాన్ ఖాన్ ‘ఆంగ్రేజ్ మీడియం లో ప్రత్యేక పాటలో కనిపించనుంది. అలాగే కరణ్ జోహార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘తఖ్త్’లో నటిస్తూ బిజీగా ఉంది. యువతరం కథానాయికలకు గట్టిపోటినిస్తూ మమ్మీ గారు రాణించడ విశేషమేనని చెప్పుకోవాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-