బెబో స్టన్నింగ్ యోగా ఫీట్స్

0

జీరో సైజ్ కి బ్రాండ్ అంబాసిడర్ అనగానే బెబో కరీనా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బాలీవుడ్ కి జీరో సైజ్ ట్రెండ్ ని పరిచయం చేసిన దేవతాసుందరిగా అభిమానులు గౌరవిస్తారు. ఇప్పటికీ ఆ గుర్తింపును కాపాడుకునేదుందుకు బెబో పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. సైఫ్ కు భార్యగా.. తైమూర్ అలీఖాన్ కి మదర్ గా బయటి ప్రపంచానికి తెలిసినా ఇంకా తన వయసును తగ్గించే పనిలోనే ఉన్నారు కరీనా. 40 వయసుకు చేరువ అవుతున్నా 20లోనే ఆగిపోయిందే! అన్న ప్రశంసల కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు.

బెబో కాల్షీట్ లో నిరంతరం యోగా- ధ్యానం తప్పనిసరి. ముఖ్యంగా యోగాలో బెబో ఎంతటి ఎక్స్ పర్ట్ అన్నది ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రిలీజైన ఫోటోలే చెబుతున్నాయి. తాజాగా కరీనా యోగా చేస్తున్న ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. అభిమానుల్లో ఇవి హాట్ టాపిక్ గా మారాయి. స్పోర్ట్స్ వేర్ ధరించి జిమ్ లో కరీనా యోగా ప్రాక్టీస్ అబ్బురపరుస్తోంది. వరల్డ్ క్లాస్ యోగా స్పెషలిస్టుగా కరీనా తనని తాను ఎలివేట్ చేయడం కనిపిస్తోంది.

అయితే రంగుల ప్రపంచంలో కెరీర్ పరంగా దూసుకెళ్లాలంటే క్రీడల్లోలానే ఫిట్ నెస్ చాలా ఇంపార్టెంట్. రూపాన్ని కాపాడుకోవడమే కాదు ఎనర్జిటిక్ గానూ ఉండాలి ఇక్కడ. అందుకే క్రమం తప్పకుండా కరీనా ఇలా శ్రమిస్తున్నారు. అసలు ఒక మహిళగా ఆరోగ్యం.. రూపానికి సంబంధించి కరీనా ఎలా ఆలోచిస్తారు అంటే.. అందరిలా స్టీరియో టైపిక్ మహిళలా కనిపించడం తనకు ఇష్టం ఉండదని అర్థమవుతోంది. వయసు అన్నది అసలు మ్యాటరే కాదు… ఎంత ఫిట్ గా ఉన్నామన్నదే మ్యాటర్!! అని తన మాటల్ని బట్టి అర్థమవుతోంది. కరీనా ప్రస్తుతం `గుడ్ న్యూస్` అనే భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. కిలాడీ అక్షయ్ కుమార్- దిల్జీత్ దోసాంజి- కియరా అద్వాణీ తదితరులు నటిస్తున్నారు. దీంతో పాటు ఇర్ఫాన్ ఖాన్ సరసన అంగ్రేజీ మీడియం అనే ప్రయోగాత్మక చిత్రంలోనూ కరీనా నటిస్తున్నారు.