కరీనా చేసిన యోగా స్టిల్స్ అంతర్జాలంలో వైరల్

0

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు యోగా వర్క్-అవుట్ ఫోటోలతో ఇన్ స్టాగ్రామ్ ను నింపారు. కరీనా కపూర్ ఖాన్ తాను యోగా సాధన చేస్తున్న ఫోటోల్ని పంచుకుంది. బెబో అంటే ఫిట్ నెస్.. ఫిట్నెస్ అంటే బెబో! అందుకు ప్రూఫ్ ఈ ఫోటోలు. బాలీవుడ్ లో దాదాపు దశాబ్ధం పాటు బెబో సైజ్ జీరో ట్రెండ్ అయ్యిందంటే తనకు ఉన్న పట్టుదల అందుకు కారణం.

తాజాగా కరీనా షేర్ చేసి యోగా స్టిల్స్ అంతర్జాలంలో వైరల్ గా మారాయి. రకరకాల భంగిమల్లో సైఫీనా స్టిల్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఇటీవల సుశాంత్ సింగ్ ఆత్మ హత్య అనంతరం దారుణం గా ట్రోలింగ్ కి గురైన బెబో ఈ యోగా సెషన్స్ తోనే వాటన్నిటినీ మర్చిపోతోందని భావించవచ్చు. బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ నెపోటిజంపై విస్త్రతంగా చర్చ జరుగుతుండడం బెబో పై ఒత్తిడి పెంచే చర్యనే. అందుకే ఇదిగో ఇలా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లి పోయిందని భావించాల్సి ఉంటుంది. “నీ మొదటి హీరోని ప్రేమించకు.. అతడి ముఖం చూడలేం“ అంటూ స్టెప్ డాటర్ సారా అలీ ఖాన్ కి టీవీ చానెల్ లైవ్ లోనే సలహా ఇచ్చిన కరీనా కపూర్ అహంకారాన్ని సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ తీవ్రం గా గర్హించారు.

ఇకపోతే బెబో ప్రస్తుతం వరుసగా సినిమాలకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు వివాదంతోనూ వైరల్ అయ్యింది. అలాగే రెగ్యులర్ ఫిట్నెస్ .. యోగా సెషన్స్ తోనూ కరీనా రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున బెబో సోదరి కరిష్మా కపూర్ యోగ సాధనతో వేడి పెంచిన ఫోటోలు వైరల్ గా మారాయి. బ్యాలెన్స్ యోగాలో సిస్టర్స్ మాంచి అనుభవజ్ఞులు సుమీ.
Please Read Disclaimer