తనకు మరదలిగా ఆ స్టార్ హీరోయిన్ కావాలంటున్న కరీనా

0

బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ అలియా భట్ లు ప్రేమలో మునిగి తేలుతున్నారు. వాళ్లిద్దరూ పైకి తమ ప్రేమ గురించి చెప్పకపోయినా అందరికీ వీళ్లిద్దరి ప్రేమ గురించి తెలుసు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. అలియా భట్ అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తుంది. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక్కటౌతారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ సిస్టర్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ వీళ్ళ ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా చేస్తున్న ఒక కార్యక్రమానికి కరీనా కపూర్ అలియా భట్ లు గెస్ట్ లుగా వచ్చారు. కరణ్ జోహార్ అలియా భట్ ను ‘నీ జీవితంలో కరీనా కపూర్ నీకు వదిన అవుతుందని ఎప్పుడైనా ఊహించావా’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం అలియా కంటే ముందే పక్కనే ఉన్న కరీనా కపూర్ చెప్పింది. ‘అలియా తనకు మరదలు అయితే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా తానే సంతోషిస్తానని’ కరీనా చెప్పింది. అలియా మాత్రం ఈ విషయం గురించి తాను ఇప్పటివరకు ఆలోచించలేదని సిగ్గుపడుతూ చెప్పింది.

నీకు రణబీర్ కు పెళ్లి అయితే కరీనా కపూర్ – తాను చాలా సంతోషిస్తామని కరణ్ చెప్పారు. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా కరీనా లా యాక్టింగ్ కంటిన్యూ చేయాలని కరణ్ అలియాను కోరారు. అలియా కూడా ‘కరీనా తన కెరీర్ ను వ్యక్తిగత జీవితాన్ని చాలా బాగా మేనేజ్ చేసిందని’ మెచ్చుకుంది. ఇంతకుముందు పెళ్లి అయితే హీరోయిన్లకు కెరీర్ ఉండదని భయపడేవారని కరీనా ని చూశాక ఆ భయం పోయిందని అలియా చెప్పింది.