రెడ్ బికినీలో రచ్చ రచ్చలే

0

నచ్ భలియే.. ఝలక్ దికలాజా లాంటి టీవీ కార్యక్రమాలతో పాపులరైంది కరిష్మా తన్నా. నటి .. మోడల్ కం యాంకర్ గా కరిష్మా తన్నా కెరీర్ జర్నీ ఆసక్తికరం. అటుపై పెద్ద తెరపైనా ఈ అమ్మడికి అడపాదడపా అవకాశాలు వచ్చాయి. అందానికి అందం వేడెక్కించే కంటెంట్ తో అమ్మడు సర్రున దూసుకొచ్చింది. ఇక నిరంతరం కరిష్మా తన్నా సోషల్ మీడియా ఫోటోలు యూత్ గుండెల్లోకి దూసుకుపోతున్నాయంటే .. ఏ స్థాయిలో చెలరేగుతోందో అర్థం చేసుకోవాలి.

ఒక గుజరాతీ ఫ్యామిలీ నుంచి పరిశ్రమకు వచ్చిన ఈ అమ్మడు హాట్ గయ్ ఉపేన్ పటేల్ తో డేటింగ్ చేయడంతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. అటుపై హిందీ బిగ్ బాస్ పార్టిసిపెంట్ గానూ తన పాపులారిటీ మరింత పెరిగింది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేవు కానీ టీవీ షోలకు కొదవేమీ లేదు. కత్రోంకి కిలాడీ సీజన్ 10 లోనూ ఈ అమ్మడు అలరించనుంది.

ఇదిగో కొంత గ్యాప్ దొరికితే చాలు ఇలా బికినీ ఫోటోలతో చెలరేగిపోయింది. డార్క్ రెడ్ బికినీలో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. టాప్ టు బాటమ్ రెడ్ లో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ బికినీ ఫోటో యూత్ సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ లలో జోరుగా వైరల్ అయిపోతోంది. అందం ఉంది.. వేడి ఉంది.. కాబట్టి తెలుగు సినిమాల్లో ఐటెమ్ నంబర్లకు ఆస్కారం ఉందేమో చూడాలి.
Please Read Disclaimer