పూల్..బికినీ.. కేకు.. కెవ్వు కేక

0

కరిష్మా తన్నా హిందీ సీరియల్స్ లో స్టార్. సీరియల్స్ మాత్రమే కాదు రియాలిటీ షోస్ చూసేవారికి ఆమె పరిచయం ఉంటుంది. అప్పుడెప్పుడో 2001 లో ‘క్యోంకి సాస్ భీ కభీ బహు థీ’ అనే సూపర్ హిట్ సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టింది కరిష్మా. 2014 లో హిందీ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. ‘గ్రాండ్ మస్తి’.. ‘సంజు’ లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. గ్లామర్ ఇండస్ట్రీ లో ఉండే అందరూ అందమైన భామలు ఎలా ఉంటారో ఈ భామ కూడా అంతే. సోషల్ మీడియాను ఓ ఆట ఆడుకుంటుంది.

కరిష్మా నిన్న తన పుట్టినరోజు జరుపుకుంది. ఏ సందర్భం లేకపోతేనే ఒక హాటు ఫోటోను షేర్ చేసి నెటిజన్లకు ఊపిరి ఆడకుండా చేసే కరిష్మా బర్త్ డే రోజున ఎలా ఊరుకుంటుంది? అందుకే కొన్ని బికినీ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “హ్యాపీ బర్త్ డే టు మీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదేదో బాగుంది కదా.. మనకు మనమే హ్యాపీ బర్త్ డే చెప్పుకుంటే ఏ గోలా ఉండదు. వాడు చెప్పలేదు.. వీడు చెప్పలేదు విష్ చేయలేదు అనే ఫీలింగ్సు తో పని లేదు. ఇక ఫోటో విషయానికి వస్తే బికినీ ధరించి ఈతకొలను లో నిలుచుంది. గట్టు మీద ఉన్న ట్రే లో బర్త్ డే కేకు కనిపిస్తోంది. ఆ కేకును కట్ చేసుకొని తింటూ.. వేళ్ళతో నాకుతూ కెవ్వు కేక పోజిచ్చింది.

ఈ ఫోటోలకు కామెంట్లు అదిరిపోయాయి. ఎక్కువ మంది హ్యపీ బర్త్ డే చెప్పారు. కానీ కొందరు చిలిపి నెటిజన్లు ఉంటారు కదా.. వాళ్ళు మాత్రం రెచ్చిపోయారు. “నేను అక్కడ ఉంటే బాగుండేది”.. “లక్కీ బికినీ”.. “జలకన్యలాగా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ ఖత్రోం కే ఖిలాడి -10 షోలో పాల్గొంటోంది.
Please Read Disclaimer