ఆ సీక్వెల్ ‘నయనతార’తోనే తీస్తా: డైరెక్టర్ క్లారిటీ

0

2017లో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో విడుదలైన సినిమా ‘కర్తవ్యం’. తమిళ సినిమా ‘ఆరమ్’కు అనువాదంగా కర్తవ్యం అని పేరు మార్చి తెలుగులో విడుదల చేశారు. అయితే ‘ఆరమ్’ సినిమాతోనే గోపీ నైనర్ కోలీవుడ్‌కు దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. సోసియో-పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార జిల్లా కలెక్టర్ పాత్ర పోషించింది. ముఖ్యంగా బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడటం.. ఓ ఊరి సమస్యల్ని తీర్చడం చుట్టూ ఉత్కంఠగా ఈ సినిమా కథ సాగుతుంది. అయితే గతంలోనే ‘ఆరమ్’కు సీక్వెల్ తీయనున్నట్టు నిర్మాత కె.రాజేష్ ప్రకటించారు.

సీక్వెల్ లో మరింత శక్తివంతమైన కథ.. సామజిక సందేశంతో ‘ఆరమ్2’ ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. దాదాపు రెండేళ్లు గడిచినా ఈ సీక్వెల్ గురించి మళ్లీ ప్రస్తావన లేకపోవడంతో సీక్వెల్ ఉండదని అంతా అనుకున్నారు. తాజాగా మళ్లీ ఆరమ్ సీక్వెల్ విషయం వార్తల్లోకెక్కింది. కానీ ‘ఆరమ్’ సీక్వెల్ ఉంది కానీ.. దానిలో నయనతార నటించడం లేదని వదంతులు వచ్చాయి. నయనతారకు కాల్షీట్లు సర్దుబాటు కావడంలేదని.. దీంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్‌ను తీసుకున్నారని కోలీవుడ్‌లో ఇంతకాలం వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ పుకార్ల పై దర్శకుడు గోపి నైనర్ తాజాగా క్లారిటీ ఇచ్చేసాడు. ఆయన మాట్లాడుతూ.. “‘ఆరమ్ 2’ కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించలేదు. అలాగే సీక్వెల్ కూడా ఆగదు. ఆరమ్ -2 సినిమాను కేవలం నయనతారతో మాత్రమే నేను చేస్తాను. మరొకరితో చేసే ఛాన్సే లేదు. ఇవన్నీ నిరాధారమైన వదంతులు. ఈ రూమర్లు చూసి నేను కాస్త బాధపడ్డాను” అని నైనర్ వెల్లడించాడు. ప్రస్తుతం కరోనా ఉన్న నేపథ్యంలో తను ఈ సినిమా పై మాట్లాడ దలచుకోలేదని స్పష్టం చేసాడు ఈ డైరెక్టర్.
Please Read Disclaimer