అనుకోని సెంటిమెంట్ తో కార్తి

0

కొన్ని సందర్భాల్లో కొన్ని సెంటిమెంట్స్ అనుకోకుండానే స్టార్స్ కి చుట్టుకుంటాయి. లేటెస్ట్ గా తమిళ స్టార్ హీరో కార్తి సినిమాకు కూడా అలాంటి ఓ అదిరిపోయే కలిసొచ్చే సెంటిమెంట్ అనుకోకుండా అంటుకుంది. తమిళ్ లో లోకేష్ కొనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కార్తి ‘కైథి’ సినిమా దీపావళి సందర్భంగా విడుదలవుతుంది.

తెలుగులో కూడా ‘ఖైదీ’గా ఒకే సారి విడుదలవుతుంది. కథకు తగిన టైటిల్ కావడంతో తెలుగులో చిరు టైటిల్ నే పెట్టుకున్నారు. అసలే మెగాస్టార్ మెగా హిట్ సినిమా టైటిల్ కావడంతో టైటిల్ అందరికీ రీచ్ అయిపొయింది. ఇదంతా పక్కన పెడితే అప్పటి చిరు ‘ఖైదీ’ కూడా అక్టోబర్ లోనే రిలీజయింది. ఇప్పుడు కార్తి ‘ఖైదీ’ కూడా ఇదే నెలలో వస్తుంది.

చిరు ఖైదీ 1983 ఏడాదిలో అక్టోబర్ 28న విడుదలైతే ఇప్పుడు కార్తి సినిమా అక్టోబర్ 25 న రిలీజ్ అవ్వడం విశేషం. మరి అనుకోని ఈ సెంటిమెంట్ కార్తి ‘ఖైదీ’కి కలిసోస్తుందా..లేదా..చూడాలి.
Please Read Disclaimer