అభిమానిపై హీరోకు ఇంతటి అభిమానమా?

0

తమిళంలో స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. అక్కడ తమ అభిమాన స్టార్స్ కు గుడి కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంతగా హీరోలను అభిమానించే అభిమానులను ఆ హీరోలు కూడా అంతే అభిమానిస్తూ వారి కోసం చాలా కష్టపడటంతో పాటు వారి కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్దం అవుతూ ఉంటారు. ఇటీవల తమిళ హీరో కార్తీ అభిమాని ఒకరు మృతి చెందారు. అభిమాని మృతదేహంను చూసి కార్తీ కన్నీటి పర్యంతం అయ్యాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కార్తీ అంటే చాలా కాలంగా వ్యాసైకి అభిమానం. కార్తీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో కూడా వ్యాసై తప్పకుండా పాలుపంచుకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యాసై ‘తంబి’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంకు ముందు చనిపోవడం జరిగింది. వ్యాసై రోడ్డు యాక్సిడెంట్ లో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కార్తీ వెంటనే అతడి ఇంటికి వెళ్లాడు. అక్కడ వ్యాసై మృత దేహంకు నివాళ్లు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశాడు.

వ్యాసై మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు కార్తీ కన్నీరు కూడా పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కార్తీ కన్నీరు పెట్టుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక అభిమానిపై ఒక హీరో ఇంతటి అభిమానంను చూపుతాడా అంటూ సోషల్ మీడియాలో కార్తీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిమాని కోసం కన్నీరు పెట్టుకున్న కార్తీని రియల్ హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.

తన కొత్త సినిమా తంబి ఆడియో వేడుకలో వ్యాసై మృతికి మౌనం పాటించాలంటూ అభిమానులతో రెండు నిమిషాల పాటు మౌనం పాటింపజేశాడు. మొత్తానికి కార్తీ చేసిన పనితో చనిపోయిన వ్యాసై ఆత్మ చాలా సంతోషి ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు.
Please Read Disclaimer