ఖాకీ సన్నివేశమే ఖైదీ రిపీట్!

0

కార్తీ కథానాయకుడిగా నటించిన ఖాకీ తెలుగు- తమిళ భాషల్లో సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. కోలీవుడ్ లో వసూళ్లకు కొదవేం లేదు. అంచనాలను మించిన వసూళ్లను సాధించింది. కానీ తెలుగులో సినిమాకు మంచి రివ్యూలు.. మౌత్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ప్రతికూల పరిస్థితుల్నే ఎదుర్కొంది. ఆ విషయంలో తెలుగు వెర్షన్ నిర్మాతల్లో అసంతృప్తిని మిగిల్చింది. మరి ఇప్పుడు అలాంటి సన్నివేశమే కార్తీ కొత్త మూవీ ఖైదీకి ఎదురవుతుందా? అంటే అవుననే సందేహం వ్యక్తమవుతోంది.

`ఖైదీ` ఐదు కోట్లు.. అంతకుమించిన వసూళ్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకూ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో 4.01 కోట్లు వసూలైంది. సినిమా హక్కుల్ని 4.3 కోట్లకు దక్కించుకుని సత్యసాయి ఆర్స్ట్ పతాకంపై కె.కె రాధామోహన్ రిలీజ్ చేసారు. టార్గెట్ ప్రకారం ఖైదీ మరో కోటి వసూల్ చేయాలి. అంటే రెండో వారం కూడా ఖైదీ థియేటర్లలలో నిలకడగా ఆడాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ చేయగలదు. లేదంటే ఖాకీ సన్నివేశం రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా కార్తీకి ఈ కష్టం ఏమిటో అన్న టాక్ వినిపిస్తోంది.

ఓసారి వసూళ్ల వివరాల్లోకి వెళ్తే. ఐదు రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం-1.68 కోట్లు – సీడెడ్-63 లక్షలు – యూఏ-45 లక్షలు – ఈస్ట్ -35 లక్షలు – వెస్ట్ -21 లక్షలు – గుంటూరు-24 లక్షలు – కృష్ణా-31 లక్షలు – నెల్లూరు-17 లక్షలు వసూలైంది. మొత్తంగా ఏపీ -తెలంగాణ లో ఐదు రోజుల్లో 4.01 కోట్లు సాధించింది. ఇక ఐదవ రోజు వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం -25 లక్షలు – సీడెడ్ -14 లక్షలు – ఈస్ట్-5 లక్షలు – వెస్ట్ -4 లక్షలు – గుంటూరు-4.3 లక్షలు – కృష్ణా-4.8 లక్షలు – యుఏ-7.1 లక్షలు – నెల్లూరు-3 లక్షలు వసూలు చేసింది.
Please Read Disclaimer