ఇన్నాళ్లు ఆవారా కార్తీ ఇకపై ‘ఖైదీ’ కార్తీ

0

తెలుగు ప్రేక్షకులకు ఆవారా చిత్రంతో దగ్గరైన తమిళ హీరో కార్తీ ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు. తెలుగు ప్రేక్షకులు కార్తీకి ఆవారా కార్తీ అంటూ పేరు పెట్టుకున్నారు. ఈమద్య కాలంలో కార్తీకి తెలుగులో సక్సెస్ పడలేదు. అయినా కూడా కార్తీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఖైదీ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సాదారణంగా అయితే తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ లేకుండా ఉండటం.. పాటలు లేకుండా ఉండే సినిమాలు అస్సలు ఎక్కవు.

తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. కాని ఖైదీ సినిమాలో అలాంటివి ఏమీ లేకపోవడంతో మొదట కొంత అనుమానం అయితే కలిగింది. కాని ఖైదీ సినిమా అందరికి నచ్చింది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా ఎమోషన్స్ తో సాగిన ఈ చిత్రంకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దాంతో సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల సంఖ్యను పెంచుతున్నట్లుగా చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.

సినిమా సక్సెస్ మీట్ లో కార్తీ మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు నన్ను ఆవారా కార్తీ అంటూ పిలిచేవారు. ఇప్పుడు ఖైదీ కార్తీ అంటూ పిలుస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు లోకేష్ ఈ స్క్రిప్ట్ ను చెప్పినప్పుడు ఇది ఒక చిన్న సినిమాగా తీయాలనుకుంటున్నట్లుగా చెప్పాడు. కాని ఇది కాస్త హాలీవుడ్ ఫిల్మ్ రేంజ్ కు వెళ్లిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తమిళం మరియు తెలుగు ఆడియన్స్ ఖైదీని ఆధరిస్తున్న తీరును చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నాడు.
Please Read Disclaimer