పబ్లిసిటీ కోసం బైక్ పై చక్కర్లు

0

కార్తీక్ ఆర్యన్.. సారా అలీ ఖాన్ జంటగా నటించిన ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సూపర్ హిట్ మూవీ లవ్ ఆజ్ కల్ చిత్రానికి సీక్వెల్ అన్నట్లుగా రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఈ యువ జంట తెగ హడావుడి చేస్తున్నారు. వీరిద్దరు షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు.. షూటింగ్ గ్యాప్ లో బాతాకానీ కొట్టడం.. పబ్ లకు క్లబ్ లకు తిరగడం చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.

మీడియాలో వస్తున్న వార్తలపై సారా రెండు మూడు సార్లు వివరణ ఇచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. సినిమా విడుదల సందర్బంగా మరోసారి ఆ వార్తలు పెరిగేలా వీరు కావాలని ప్రమోషన్ కోసం అనుమానం వచ్చే వీడియోలు మరియు పోస్ట్ లు పెడుతున్నారు.

తాజాగా హీరో కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టాగ్రామ్ లో సారాతో కలిసి బైక్ పై వెళ్తున్న చిన్న వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో సినిమాకు సంబంధించింది కాదనిపిస్తుంది. షూటింగ్ గ్యాప్ లో వీరిద్దరు సరదాగా ఇలా బైక్ పై చక్కర్లు కొట్టారు అని ప్రచారం జరగడం కోసం ఇప్పుడు ఈ వీడియోను పోస్ట్ చేసి ఉంటారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా పబ్లిసిటీ కోసం ఇదో కొత్త తరహా ప్రయత్నం అంటూ కొందరు కార్తీక్ ఆర్యన్ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Challan Katega Aur mera bhi ….

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on
Please Read Disclaimer