తన కొత్త సినిమా పట్ల నిరాశ చెందుతున్న స్టార్ హీరో.. అందుకేనా?

0

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తెలుగులో ‘జగమే తంత్రం’ అనే పేరుతో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ లో ధనుష్ డిఫరెంట్ గెటప్లో దర్శనమిచ్చాడు. చొక్కా పంచెతో తమిళ సంప్రదాయంలో కనిపించినా.. చేతిలో గన్నులతో కాస్త జడిపించాడు. దీంతో మాస్ ఆడియన్స్కు ఈ సినిమాతో పండగే అని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరో విషయం ఏంటంటే హీరో ధనుష్కు ఇది 40వ సినిమా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇదివరకే వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ నిలిపేయడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లు మంచి రెస్పాన్స్ సాధించాయి. తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని… ఈ కరోనా నుండి ఈ జగం కోలుకున్నాక థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్. లాక్ డౌన్ వల్ల రిలీజ్ లు ఆగిపోవడంతో పలు సినిమాలతో పాటు జగమే తంత్రం కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ హీరోతో ఈ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేసాడట. అయితే డైరెక్టర్ నిర్ణయంతో ధనుష్ కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం. ఎందుకంటే ధనుష్ తన సినిమాను అభిమానులు థియేటర్లలోనే చూడాలని.. ఎంజాయ్ చేయాలనీ అనుకున్నాడట. కానీ ఒక్కసారిగా డైరెక్టర్ కూడా ఓటిటి ప్రస్తావన తేవడంతో.. మోహం చాటేసినట్లు తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే కార్తీక్ నిర్మించిన పెంగ్విన్ సినిమా ఇటీవలే ఓటిటిలో రిలీజ్ చేసాడు. అందుకోసమే థియేటర్ల రిస్క్ లేకుండా జగమే తంత్రం కూడా ఓటిటిలో విడుదల చేస్తే అయిపోతుందని భావిస్తున్నాడట. వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు. చూడాలి మరి దీని పై నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..!
Please Read Disclaimer