నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ ట్విస్ట్?

0

న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ మీద టీజర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి . ఐదుగురు లేడీస్ తో నాని చేసే రివెంజ్ డ్రామాగా క్లారిటీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇందులో మరో యూత్ హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ టీజర్ లో ఇతన్ని రివీల్ చేయలేదు. తాజాగా దీనికి సంబంధించిన ట్విస్ట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

దాని ప్రకారం విలన్ గా చేస్తున్న కార్తికేయ ఎంట్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో వస్తుందట. కథలో కేంద్ర బిందువు తనే కావడం ఆరు కీలక పాత్రలు తనకోసమే లక్ష్యాన్ని పెట్టుకోవడం లాంటివి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయట. అందుకే టీజర్ లో రివీల్ చేయకుండా జాగ్రత్త పడినట్టు చెబుతున్నారు. పేరుకి సెకండ్ హాఫ్ లోనే ఉన్నా కథ ప్రకారం ఆ పాత్ర ఉన్న ఫీల్ సినిమా ఫస్ట్ హాఫ్ లోనూ ఉంటుందట – దర్శకుడు విక్రమ్ కుమార్ తన స్క్రీన్ ప్లే తో మరోసారి ఏదో మేజిక్ చేసుండాలి.

ఒకరకంగా చెప్పాలంటే ఈగలో కిచ్చ సుదీప్ కు ఉన్నంత వెయిటేజ్ ఇందులో కార్తికేయకు ఉంటుందని వినికిడి. అందులోనూ హీరో నానినే కావడం విశేషం. సో జెర్సీ లాంటి ఎమోషనల్ డ్రామా తర్వాత మంచి ఎంటర్ టైనింగ్ హై వోల్టేజ్ రివెంజ్ ప్లాట్ తో వస్తున్న నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ మీద మొదట్లో వచ్చిన మెగా ఫ్యాన్స్ వ్యతికరేకతను మెల్లగా తగ్గించుకుంటున్నాడు. ట్రైలర్ వచ్చాక అది పూర్తిగా మాయమవుతుందన్న నమ్మకం అతనిలో ఉంది. వరస ఫ్లాపుల పరంపరలో ఉన్న మైత్రి సంస్థకు గ్యాంగ్ లీడర్ హిట్ కావడం చాలా అవసరం. ముందు ఆగష్టు 30 అని ప్రకటించారు కానీ అదే తేదీని సాహో లాక్ చేయడంతో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు
Please Read Disclaimer