నో రౌడీ వేషాలు.. నిర్మాతల ప్రెజరేనా?

0

డెబ్యూ సినిమా ‘RX100’ ఘన విజయంతో కార్తికేయకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపే వచ్చింది. పర్సనాలిటీ.. లుక్స్ కూడా ఈ జెనరేషన్ ఆడియన్స్ లైక్ చేసేలా ఉండడంతో మంచి ఆఫర్లే వచ్చాయి. కార్తికేయ కూడా మంచి జోష్ లో సినిమాలకు సైన్ చేశాడు. అందులో ఒక సినిమా ‘హిప్పీ’ ఇప్పటికే విడుదలయింది. మరో సినిమా ‘గుణ 369’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

రీసెంట్ గా ‘గుణ 369’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి కార్తికేయ పట్టు పంచె.. చొక్కాలో సంప్రదాయ వస్త్రధారణలో హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాదు ఈవెంట్ లో కార్తికేయ స్పీచ్ కూడా ఎంతో మర్యాదపూర్వకంగా సాగింది. మరో హీరో ఇలా ట్రెడిషనల్ డ్రెస్ లో హాజరై.. సింపుల్ స్పీచ్ ఇచ్చి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ కార్తికేయ ఇలాంటి గెటప్ లో కనిపించడం.. డీసెంట్ స్పీచ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. ఎందుకంటారా? కార్తికేయ లాస్ట్ ఫిలిం ‘హిప్పి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తికేయ చేసిన హంగామా.. షర్టును విప్పి గిరాటేసి తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ డ్యాన్స్ చేయడం అందరికీ గుర్తుంది. అప్పట్లో స్పీచ్ కూడా కాస్త బోల్డ్ గానే సాగింది. అందుకే ఈ డీసెంట్ బిహేవియర్ జనాలకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

అయితే ‘హిప్పీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎంత హంగామా చేసినా ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఆ ఎక్స్ పీరియన్స్ నుండి కార్తికేయ నేర్చుకున్నట్టే అనిపిస్తోందని.. ఇప్పటివరకూ విజయ్ దేవరకొండ స్టైల్ ను ఫాలో అవుతున్న కార్తికేయ ఈసారి హంగామా మంత్రం కాకుండా హంబుల్ మాత్రం పఠించాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ‘గుణ 369’ నిర్మాతలు కార్తికేయను డీసెంట్ గా ఉండాలని..అగ్రెసివ్ గా మాట్లాడుతూ అనవసరమైన హంగామా చేస్తే సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ వస్తుందని ముందే చెప్పారని.. ఆ ప్రెజర్ వల్లే కార్తికేయలో మార్పు కనిపించిందని.. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది.
Please Read Disclaimer