గీతాఆర్ట్స్ తోనైనా లక్ కలిసి వచ్చేనా?

0

హీరో కార్తికేయ అనగానే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆయన మొదటి సినిమా అయిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. నటుడిగా మంచి పేరు కూడా దక్కించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా.. విలన్గా కూడా పలు చిత్రాల్లో నటించిన కార్తికేయ సక్సెస్ ను మాత్రం దక్కించుకోలేదు. ఇన్ని సినిమాలు చేసినా కూడా కార్తికేయ అనగానే ఆర్ఎక్స్ 100 చిత్రమే గుర్తుకు వస్తుంది అంటే ఆయన చేసిన సినిమాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మొదటి విజయాన్ని.. వచ్చిన పేరును ఉపయోగించుకుని కెరీర్ ను బిల్డ్ చేసుకోవడంలో కార్తికేయ సఫలం కాలేక పోతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో కార్తికేయకు అనూహ్యంగా గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో ఒక సినిమా చేసే ఛాన్స్ దక్కింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు.. మంచి చిత్రాలను నిర్మిస్తున్న గీతాఆర్ట్స్ బ్యానర్ తో కార్తికేయకు కాలం కలిసి వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది.

గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో కార్తికేయ హీరోగా కౌశిక్ దర్శకత్వం లో ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రం తెరకెక్కుతుంది. నేడు ఈ చిత్రం లాంచనంగా ప్రారంభం అయ్యింది. అల్లు అరవింద్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. శవాలను మోసే ఒక వ్యాన్ డ్రైవర్ బాలరాజు పాత్రలో ఊర మాస్ లుక్ తో కార్తికేయ కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ వచ్చేసింది.

సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటంతో మొదటి ఇంప్రెషన్ పడిపోయింది. ఇక ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కనిపించబోతుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రం అయినా కార్తికేయకు లక్ తీసుకు వచ్చి సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి.
Please Read Disclaimer