క్యూటీని నిక్ నేమ్ తో ఏడిపించిన హీరో

0

ఆన్ లొకేషన్ కెమిస్ట్రీ కుదిరింది అని చెప్పడానికి ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యమే కొలమానం. అలా చూస్తే యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో జాన్వీ టూ క్లోజ్ గా స్నేహం చేస్తోందనే అర్థమవుతోంది. వీలున్నప్పుడల్లా ఈ యంగ్ హీరోతో జాన్వీ పరాచికాలు ఆడేస్తోంది. ఇక జాన్వీని ఏకంగా జే-జీ అని నిక్ నేమ్ పెట్టి పిలిచేస్తూ బోలెడంత ఏడిపిస్తున్నాడు కార్తీక్. ఆ ఇద్దరికీ దోస్తానా 2 సెట్స్ లో బాగా ర్యాపో కుదిరిందని అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరూ కలుసుకున్నప్పుడు గమ్మత్తయిన సంభాషణలు బయటపడుతున్నాయి. అసలే వయసులో ఉన్న యువతీయువకులు కావడంతో లొకేషన్ లో ఇతరులకు సందేహాలు తప్పదు మరి. ఇక ఓ ఈవెంట్ ముగిశాక ఇదిగో ఇలా కలిసిపోయి ఎంతో అన్యోన్యంగా కనిపించారు జాన్వీ- కార్తీక్ ఆర్యన్. దోస్తానా 2 ప్రస్తుతం సెట్స్ పై ఉంది. కార్తీక్ తో సెట్స్ లో జాన్వీ కెమిస్ట్రీ బాగానే వర్కవుటవుతోందట. ఇక కార్తీక్ కి స్నేహితురాలు అయిపోయింది. అతడు నటించే ఇతర సినిమాలను ప్రస్థావిస్తూ జాన్వీ సోషల్ మీడియాలో బోలెడన్ని కామెంట్లు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇంతకుముందు కార్తీక్ ఆర్యన్ – సారా అలీఖాన్ జంటగా నటించిన లవ్ ఆజ్ కల్ సీక్వెల్ లోని షాయద్ పాటకు చక్కని వ్యాఖ్యను జోడించింది జాన్వీ. దానికి ప్రతిస్పందనగా కార్తీక్ స్పందించాడు. `అబ్సెషన్ క్లబ్ జె జికి స్వాగతం` అంటూ జాన్వీని కార్తీక్ ఆహ్వానించడం ఆసక్తిని కలిగించింది. మొత్తానికి జే జి అంటూ జాన్వీకి నిక్ నేమ్ ని పెట్టేశాడు కార్తీక్. ఆ ఇద్దరి మధ్యా స్నేహంపై ప్రస్తుతం యూత్ గుసగుసగా ఎంతో ఇదిగా ముచ్చట్లాడేసుకోవడం ఆసక్తికరం. ఇక నవతరంలో ప్రతిభావంతుడిగా ఎదిగేస్తున్న కార్తీక్ ఆర్యన్ కి గాళ్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇంతకుముందు ఓ వీరాభిమాని ఏకంగా అతడి ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మరీ ఐ లవ్ యు చెప్పడం షాకిచ్చింది.
Please Read Disclaimer