స్టైలిష్ స్టార్ కారవాన్ రెడీ అవుతోందోచ్!

0

స్టార్ హీరోలు కారవాన్లు వాడడం సాధారణమైన విషయమే. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ చాలామంది టాప్ లీగ్ స్టార్ హీరోలు కారవాన్లు వాడతారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ కూడా ఒక కారవాన్ ను డిజైన్ చేయించుకుంటున్నాడట. మిగతా స్టార్ హీరోల లాగానే అయితే స్టైలిష్ స్టార్ ప్రత్యేకత ఏముంది? అందుకే ఈ కారవాన్ ను ఆధునికంగా తీర్చిదిద్దుతున్నారట.

ఈ కారవాన్ ధర రెండు కోట్ల రూపాయలకుపైచిలుకేనట. ఇది అసలు ధర. ఇక అల్లు అర్జున్ తన టేస్ట్ తగ్గట్టుగా ఇంటీరియర్స్.. మోడరన్ ఫెసిలిటీస్ ఉండేలా కస్టమైజ్ చేసేందుకు దాదాపు ఇదు కోట్లవరకూ ఖర్చు చేస్తున్నారట. ఇందులో AA అనే లోగో కూడా వస్తుందట. అంటే తన కారవాన్ కోసం అల్లు అర్జున్ దాదాపుగా ఏడు కోట్ల రూపాయలకు ఖర్చు చేస్తున్నట్టు. బాలీవుడ్ లో ఇంత కాస్ట్లీ కారవాన్ లు వాడే స్టార్ హీరోలు ఉన్నారు కానీ సౌత్ వరకూ చూసుకుంటే మాత్రం ఇదే ఫస్ట్ అంటున్నారు.. ఈ కారవాన్ కు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్లు ఫైనలైజ్ చేసేందుకు త్వరలోనే అల్లు అర్జున్ ముంబై వెళ్తున్నాడట.

సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ‘నాపేరు సూర్య’ తర్వాత అల్లు అర్జున్ కొంచెం వెయిట్ పెరిగిన సంగతి తెలిసిందే. అందుకే బన్నీ రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తూ.. డైట్ ఫాలో అవుతూ షూటింగ్ స్టార్ట్ చేసేలోపు స్లిమ్ గా మారే ప్రయత్నాలలో ఉన్నాడు. త్వరలోనే బన్నీ కొత్త లుక్ లో ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశం ఉంది.
Please Read Disclaimer