‘ఆర్టికల్ 370’ పై మూవీ.. గొడవలవుతాయేమో?

0

జమ్ము కశ్మీర్ టెర్రరిజం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. ముస్లిం ముష్కర తీవ్రవాదుల దాడులు నిరంతరం ఇండియాలో హాట్ టాపిక్. భారతదేశంలో విధ్వంశాలకు పాల్పడడడమే ఏజెండాగా కుట్రలకు పాల్పడే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ధమనకాండకు చెక్ పెట్టేందుకు దశాబ్ధాల కాలంగా భారత ప్రభుత్వాలు చేయని ప్రయత్నమే లేదు. కానీ ఇప్పటికీ విముక్తి లేదు. అయితే అందులో తొలి అడుగు ఆర్టికల్ 370 రద్దు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. నిరంతరం జనజీవనాన్ని స్థంభింబజేసిన ఎన్నో అంశాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నమ ఇది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆర్మీ దళాలు జమ్ము కశ్మీర్ లో పహారాను ఏర్పాటు చేశాయి.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లనే జమ్మూకశ్మీర్లో జరిగిన బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్(బీడీసీ) ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని ప్రధాని తాజాగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో 98.3 శాతం పోలింగ్ నమోదైంది. యువకులు.. ప్రజా ప్రతినిధులు జమ్మూకశ్మీర్ రాత మారుస్తారని.. ఎలాంటి హింసాత్మక అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు జరిగిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. జమ్మూ – కశ్మీర్ – లేహ్ – లదాఖ్ ల్లో గురువారం బీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలో కశ్మీర్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుని సినిమాని తెరకెక్కించడం అంటే సాహసమే. అది ఎన్నో భావోద్వేగాల సమ్మేళనంగా ఉంటుందనడంలో సందేహం లేదు. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ కొత్త బ్యాక్ డ్రాప్ తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక వివాదాస్పద ఆర్టికల్ రద్దు సందర్భంగా ఎదురైన సన్నివేశాల్ని తెరపై చూపిస్తారనే అంచనా వేస్తున్నారు. ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ ఛాలెంజింగ్ కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఉత్తరాదినా దీనిపై ఆసక్తికర చర్చ సాగే వీలుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని `కశ్మీర్ ఫైల్స్` పేరుతో రూపొందిస్తున్నారు. స్వాతంత్య్రదినోత్సవ కానుకగా 2020 ఆగస్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఊరి లాంటి దేశభక్తి ప్రధాన చిత్రాన్ని తెరకెక్కిస్తే జనం బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మరో వివాదాస్పద టాపిక్ పై సినిమా తీస్తున్నారు కాబట్టి రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి నెలకొంటుందనడంలో సందేహం లేదు.