బిగ్ బాస్ పై కత్తి కామెంట్… అలా అడిగితే తప్పేంటట

0

స్టార్ మా టీవీలో త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్-3 సీజన్ పై అప్పుడే వివాదాలు చుట్టుముట్టేశాయి. తొలి రెండు సీజన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగినా.. మూడో సీజన్ కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ రియాలిటీ షోలో ఎంపిక చేసిన కంటెస్టెంట్ల సెక్సువల్ లైఫ్ పై బిగ్ బాస్ షో నిర్వాహకులు సంధించిన ప్రశ్నలతో ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. వంద రోజుల పాటు సెక్స్ లైఫ్ లేకుండా ఉండగలరా? అంటూ అడిగిన ప్రశ్నను ‘పిదా’ ఫేమ్ గాయత్రి గుప్తా తప్పుబట్టడంతో పాటు కేసు కూడా పెట్టేసింది. ఇక బిగ్ బాస్ ను ఎలా శాటిస్ఫై చేస్తారన్న ప్రశ్నకు చిర్రెత్తిన టీవీ యాంకర్ శ్వేతారెడ్డి అంతకుముందే కేసు పెట్టేశారు. ఇలాంటి క్రమంలో బిగ్ బాస్-1 షో ద్వారా సెలబ్రిటీగా మారిన టాలీవుడ్ క్రిటిక్ కత్తి మహేశ్… ఇప్పుడు ఈ వివాదంలోకి దూకేసి సంచలనం రేపుతున్నారు.

బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నల్లో తప్పేం లేదన్న యాంగిల్ లో తనదైన శైలి కామెంట్లు చేసిన కత్తి మహేశ్… ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేశారనే చెప్పాలి. బిగ్ బాస్ నిర్వాహకులకు మద్దతుగా నిలుస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న కత్తి మహేశ్… సోషల్ మీడియా వేదికగా సంధించిన అంశం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. బిగ్ బాస్ షోలో తనకు అవకాశం వచ్చినప్పుడు కూడా తననూ ఇదే మాదిరిగా 70 రోజులు సెక్స్ లేకుండా ఉండగలరా? అని ప్రశ్నించారని కత్తి పేర్కొన్నారు. దానిని తాను బాత్ రూంలో కెమెరాలు ఉండవు కదా… తాను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానని చెప్పానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన మాదిరే యాక్టివ్ సెక్స్ లైఫ్ కలిగిన గాయత్రి గుప్తాను షో నిర్వాహకులు అదే ప్రశ్న వేశారని ఇందులో తప్పేముందని కత్తి ప్రశ్నించారు. కత్తి వాదనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. ఓ కంటెస్టెంట్ గా తనను అడిగినట్టే… ‘ఇదే ప్రశ్న ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పుడు 2019లో అడిగితే…తప్పైపోతుందా?!?.. జస్ట్ ఆస్కింగ్!’ అంటూ కత్తి మహేశ్ తనదైన శైలి కామెంట్ చేశారు.

ఈ కామెంట్ కు నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఆ అమ్మాయి యొక్క మెంటల్ మెచ్యూరిటి మీద ఆధారపడి ఉంటుంది’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానిస్తే… మొరకరేమో… ‘మరీ ఇంత బోల్డ్ గా అడిగితే ఎలా?? అయినా సెక్స్ అనేది ప్రైవేట్ విషయం అలా పబ్లిక్ గా అడిగితే ఎలా మాస్టారు’ కత్తిపై ఫైరయ్యారు. ఈ ప్రశ్నలకు కత్తి మళ్లీ సమాధానం కూడా ఇచ్చేశారు. ఆ సమాధానంలో ఏమన్నారంటే… ‘బిగ్ బాస్ షో అనేది ప్రయివేట్ లైఫ్ ని పబ్లిక్/బజార్లో లో పెట్టే షో. మీకు ఎలాంటి పరిస్థితిలో కోపం వస్తుంది? అలాంటి పరిస్థితిలో ఎలా రియాక్ట్ అవుతారు అని సైకాలాజికల్ ప్రొఫైలింగ్ చెయ్యడం ఎంత సహజమో…నార్మల్ సెక్స్ లైఫ్ ఉన్నోళ్లని “ఎలా” అని అడగటం కూడా సహజమే’ అంటూ కత్తి తనదైన శైలి ఆన్సర్ ఇచ్చారు. మొత్తంగా కేసుల దాకా వెళ్లిన బిగ్ బాస్ -3ని కత్తి మరే తీరాలకు చేరుస్తారో చూడాలి.
Please Read Disclaimer