చావు కబురు చల్లగా..! మెల్లిగా చెప్పారు!!

0

యంగ్ హీరో కార్తికేయకు పరాజయాలు ఎదురవుతున్నా.. అతడికి క్రేజ్ ఎంత మాత్రం తగ్గడం లేదు. ఆర్.ఎక్స్ 100 తెచ్చిన క్రేజు ఇంకా చెక్కు చెదరకుండా ఉందనడానికి ఇటీవల కెరీర్ లైనప్ పరిశీలిస్తే అర్థమైపోతుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా రాణిస్తున్న కార్తికేయకు పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు.

ఇక నవతరం కథానాయకుల్లో చురుకైన హీరోల్ని వెతికి అవకాశాలిస్తున్న జీఏ2 బ్యానర్ ఇప్పటికే నాగచైతన్య.. విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాల్ని అందించింది. ప్రస్తుతం అఖిల్ కి అలాంటి అవకాశం ఇచ్చింది. అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ చిత్రం సెట్స్ పై ఉంది. ఇదే కోవలో ఈసారి కార్తికేయకు ఓ ఛాన్స్ ఇచ్చిందనే చెప్పాలి. బాస్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా `చావు కబురు చల్లగా..!` చిత్రాన్ని ప్రకటించారు.

కార్తికేయ ఈ చిత్రంలో బస్తీ బాలరాజుగా నటిస్తున్నారు. బన్నీవాసుతో పాటు కౌశిక్.పి- సునీల్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా కొనసాగుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. కథానాయికలు.. ఇతర కాస్టింగ్.. టెక్నీషియన్స్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Please Read Disclaimer