కత్రిన రెబల్ స్టార్ లుక్

0

విప్లవానికి స్ఫూర్తిలా.. రివల్యూషనరీ పొలిటీషయన్ గడ్డాఫీలా ఉంది.. ఎవరీ అమ్మడు అంటారా? అంతగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అందాల కథానాయిక కత్రిన కైఫ్ ఇదిగో ఇలా దిగింది విమానాశ్రయంలో. అప్పుడే ఆర్మీ ఆపరేషన్ లో పాల్గొని సక్సెస్ సాధించిన స్మైల్ ఆ ఫేస్ లో కనిపిస్తోంది.

ఇటీవల కత్రిన యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందని ఈ ఫోటో చూస్తే చెప్పొచ్చు. టైగర్ జిందా హై.. భారత్ వంటి దేశభక్తి చిత్రాల్లో నటించాక ఈ అమ్మడు ఇలా అయ్యిందా అంటే అవుననే భావించవచ్చు. టాప్ టు బాటమ్ ఆర్మీ లుక్ ని తలపించే ఈ అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో అదరగొడుతోంది. కాళ్లకు ఆ బరువైన బూట్లు చూస్తుంటే పక్కాగా డ్రెస్ కోడ్ కి తగ్గట్టే కాంబినేషన్ ని ప్లాన్ చేసింది.

ప్రస్తుతం కత్రిన సొంతంగా బ్యూటీ ఉత్పత్తుల కంపెనీని ప్రారంభిస్తోంది. ఈ సందర్భంగా పలువురు స్టార్లతో కలిసి ఫోటోషూట్ల హడావుడిలో బిజీబిజీగా ఉంది. ఆ క్రమంలోనే ఈ అమ్మడు విమానాశ్రయాల చుట్టూ తిరుగుతోంది. ముంబై టు చెన్నయ్.. చెన్నయ్ టు ముంబై.. ఇతరత్రా మెట్రో నగరాల్లో పర్యటిస్తూ రకరకాల యాడ్ షూట్లలోనూ పాల్గొంటోంది.
Please Read Disclaimer