దిశా పటానికి సరైన పోటీ!

0

కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా.. పోటీ తీవ్రంగా ఉన్నా కత్రినా కైఫ్ మాత్రం ఇప్పటికీ బాలీవుడ్ లో తన సత్తా చాటుతూనే ఉంది. 15 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా ఇంకా అదే గ్లామర్ కొనసాగిస్తూ ప్రేక్షకులను మాయలో పడేయడం సాధారణ విషయం కాదు. చాలామంది పనిలేని హీరోయిన్ల లాగా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా కోసమే ఫోటో షూట్లు చెయ్యదు. ప్రముఖ మ్యాగజైన్ల కోసం కత్రినా ఫోటోషూట్లు చేస్తుంది. తాజాగా జీక్యూ మ్యాగజైన్ కత్రిన ఫోటోలను ప్రచురించింది.

ఈ ఫోటో లో కత్రినా నలుపు రంగు దుస్తులలో కనిపించింది. నలుపు రంగు టాప్ ను ముందు వేసుకోకుండా స్టైలుగా వెనక్కు పెట్టుకుంది. దీంతో కత్తిలాంటి కత్రినా అందాలు మొహమాటం లేకుండా బైటపడ్డాయి. సహజంగా ఇలాంటి ఇన్నర్ వేర్ ఫోటో షూట్లు కాల్విన్ క్లెయిన్ కోసం దిశా పటాని చేస్తుంటుంది. మరి పోటీ లో ఉన్నప్పుడు కత్రినా ఊరుకుంటుందా.. అందుకే అలాంటి ఇన్నర్ వేర్ ఫోటో షూట్ నే కత్రినా కూడా చేసింది. గోవాలోని ఒక బీచ్ నేపథ్యంలో ఫోటో కావడంతో అందంగా ఉంది. అతి తక్కువ మేకప్ తో కొంచెం గజిబిజిగా స్టైలిష్ చేసిన జుట్టు తో సూపర్ హాట్ ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఫోటోలకు పోజిచ్చింది.. కత్రినా స్కిన్ కలర్.. ఫేస్ చూస్తే దేశంలో ఉండే లక్షల కొద్ది వితండవాదులు తమ వాదాన్ని వదిలేసి కత్రినావాదం మొదలుపెడతారు. కత్రినావాదం అంటే ఏంటి అనే అనుమానాలను మొగ్గలోనే తుంచేయండి. ఈ దేశంలో చాలా ఇజాలు ఉన్నాయి. చాలామంది జఫ్ఫాలు వారే ఇజం గురించి మాట్లాడుతున్నారో వారికే సరిగ్గా తెలీదు. మరి అలాంటప్పుడు కత్రినాయిజం.. సన్నీ లియోనిజం.. సల్మాన్ భాయిజం.. సంజయ్ దత్తిజం ఉంటే ఈ దేశానికి వచ్చిన నష్టం ఏంటి?

ఇజాలను వదిలేసి మరోసారి ఫోటో దగ్గరికి వస్తేఅసలు ఇలాంటి ఫోటోలు చూసినప్పుడే కత్రినా ఎందుకు ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుందో అర్థం అవుతుంది. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ సినిమా కు దర్శకుడు.
Please Read Disclaimer