మెక్సికో లో ఖజురహో అందం

0

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు మొదటి నుంచి క్రేజ్ ఎక్కువే. అదే క్రేజ్ ఇప్పటికీ కొనసాగడం చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి.. అవేంటంటే ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటెయిన్ చెయ్యడం.. ఇప్పటికీ టాప్ హీరోల సినిమాల్లో నటించడం.. ఆ సినిమాలు హిట్ కావడం. వీటితో పాటు భాయిజాన్ కు జిగ్రీ దోస్తు కాబట్టి కత్రినా కెరీర్ డౌన్ అయిందంటే చాలు ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడు. దాంతో ఒక్కసారిగా సక్సెస్ లోకి వచ్చేస్తుంది. ఇది మరో కిటుకు!

ఇదిలా ఉంటే కత్రినా తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియా తోలు ఒలుస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా అలాంటి పనే మరోసారి చేసింది. అయితే ఈ ఫోటో కొత్తది కాదట. ఈ ఏడాది జులై లో మెక్సికో వెకేషన్ కు వెళ్ళిన సమయంలో తీయించుకున్న ఫోటో. కత్రినా పుట్టిన రోజు జులై 16.. ఈ ఏడాది మెక్సికో లోని అందమైన బీచులలో తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ తన పుట్టిన రోజును ఎంతో సంతోషంగా జరుపుకుందట. ఈ ఫోటోలో బ్లాక్ అండ్ వైట్ డిజైన్ ఉన్న మొనోకిని ధరించి సముద్రంలో ఈత కొట్టిన తర్వాత బోటు ఎక్కుతూ ఉంది. చూస్తుంటే ఖజురహో 2.0 శిల్పంలాగా కనిపిస్తోంది. ఆ జుట్టు గాలికి ఎగురుతూ కత్రినాకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది. ఇలా ఈత ఫోటోలో కూడా కత్రినా మేకప్ వేసుకోవడం గమనార్హం. కనురెప్పలను గమనించి చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది. అయితే ఈ మేకప్ ఫోటోకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది.

కత్రినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘సూర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పపై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer