బిగి సడలని వర్కవుట్ చూశారంటే!

0

ఆ ఇద్దరూ విదేశీ ముద్దుగుమ్మలే అయినా లోకల్ గాళ్స్ కి పోటీనిస్తూ ముంబై పరిశ్రమలో ఎవరి దారిలో వాళ్లు సత్తా చాటారు. సెలబ్రిటీ ప్రపంచంలో నిరంతరం తమను తాము గెలిపించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇక ఇందులో ఒకరు స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ అయితే.. ఇంకొకరు యాంకర్ కం మోడల్ కం నటి సోఫియా హయత్.

ప్రస్తుతం ఆ ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారు? అంటే.. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ హాట్ గాళ్స్ రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్స్. కుర్రభామలకు పోటీగా టోన్డ్ బాడీని బిల్డప్ చేయడంలో వీళ్ల తర్వాతనే. దానికోసం ఎంతగా శ్రమిస్తారో ఇదిగో ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది. WWE కాంపిటీషన్స్ కి పంపిస్తే ఆ ఇద్దరూ కప్ గెలుచుకు రావడం గ్యారెంటీ అనిపిస్తోంది కదూ..

సోఫియా పర్ఫెక్ట్ ఫిజిక్.. మెలితిరిగిన కండలు చూస్తుంటే జిమ్ లో ఎంతగా శ్రమిస్తోందో ఈ లుక్ చెబుతోంది. అలాగే కత్రిన ఎంతగా శ్రమిస్తుందో ఆవిష్కరించే జిమ్మింగ్ ఫోటోలు.. వీడియోలు అంతర్జాలంలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇదంతా ఓ ఫిట్ నెస్ కార్యక్రమం కోసం సోఫియా చేస్తున్న కార్యక్రమం. కత్రిన రీబాక్ కి ప్రచారం చేస్తుంటే సోఫియా రీడ్ అనే స్పోర్ట్ డ్రెస్ కంపెనీకి ప్రచారం చేస్తున్నారు మరో కోణంలో.
Please Read Disclaimer