ఈ 15 ఏళ్లలో చాలా సంపాదించుకుందట

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు అవుతుంది. ఈమె 2005వ సంవత్సరంలో మైనే ప్యాన్ కున్ కియా అనే చిత్రంతో సల్మాన్ ఖాన్ తో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత వెనక్కు చూసుకోకుండా కత్రీనా కైఫ్ చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. బాలీవుడ్ లో దాదాపు టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈ అమ్మడు గత ఏడాది భారత్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంకా స్టార్ హీరోలకు జోడీగా హాట్ ఐటెం బాంబ్ పాత్రలను చేస్తూనే ఉంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దశాబ్ద కాలంకు పైగా కెరీర్ సాగించిన ఈ అమ్మడు తన 15 ఏళ్ల సినీ కెరీర్ పై చాలా సంతృప్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఒక టాక్ షో లో కత్రీనా కైఫ్ మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో నటించడం నాకు మంచి అనుభవంను మిగిల్చింది. చెప్పలేనంత సంతృప్తిని పొందాను. సినిమాల వల్ల ఎన్నో ప్లేస్ లకు వెళ్లాను అప్పుడు తాను పొందిన ప్రశాంతత ఎప్పటికి మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది.

నాకు దక్కిన ప్రతి పాత్రను ప్రేమించి చేసేందుకు నేను ప్రయత్నించాను. పాత్ర చిన్నది అయినా పెద్దది అయినా నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాను అంది. ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా ఈ అమ్మడు ఎప్పుడు వెనుకాడలేదు. ఈ అమ్మడి గ్లామర్ మరియు జోరు చూస్తుంటే మరో అయిదు సంవత్సరాల వరకు ఈమె జోరు.. దూకుడు కొనసాగడం ఖాయం అనిపిస్తుంది.
Please Read Disclaimer