వైట్ గౌన్లో లాంగ్ లెగ్డ్ కత్రినా

0

బాలీవుడ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఇప్పటికి కత్రినా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి 16 ఏళ్ళు. అయినా ఇంకా క్రేజీ హీరోయిన్ గానే కొనసాగుతోంది. రీసెంట్ గా ‘భారత్’ తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ కు సాటిలేదు. అందరికంటే ఆలస్యంగా పోయినేడాదే ఇన్స్టాగ్రామ్ లో అడుగుపెట్టింది కానీ అతి తక్కువ సమయంలోనే కత్రీనా 24 మిలియన్ల ఫాలోయర్లను సాధించింది.

నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది కత్రినా. అయితే మన ఫోటోస్టొరీలకు ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనే ఫోటోలేనా? అందుకే జస్ట్ ఫర్ ఎ చేంజ్.. ఫ్లాష్ బ్యాక్ లోని కత్రినా ఫోటో గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఫోటో కత్రినా నటించిన ‘ఫితూర్’ ప్రమోషన్స్ సందర్భంగా తీసింది. ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది కానీ ఆదిత్య రాయ్ కపూర్ తో కత్రీనా జోడీ మాత్రం అందరినీ మెప్పించింది. కత్రినా పొడగరి కావడంతో బాలీవుడ్ లో ఉండే సగం మంది స్టార్ల తో జోడీ కడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ఈ ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం మన వరుణ్ తేజ్ టైపులో మలక్ పేట్ టీవీ టవర్ అంత పొడవుగా ఉంటాడు. అందుకే కత్రినాకు జోడీగా సెట్ అయ్యాడు.

ఫోటో విషయానికి వస్తే కత్రినా వైట్ కలర్ షార్ట్ గౌన్ వేసుకొని చేతులను నడుముపై పెట్టుకొని ముచ్చటగా పోజిచ్చింది.. యాక్సెసరీస్ ఏవీ పెట్టుకోకుండా లూజ్ హెయిర్ తో మోడరన్ చిక్ లుక్ లో ఉంది. అసలే పొడవు.. పైగా హై హీల్స్ వేసుకుంది.. అయినా అందంగా కనిపిస్తోంది. డ్రెస్ కు జిప్ ఉండడం మరింత స్టైలిష్ గా ఉంది. ఇక ఈ ఫోటోలో హైలైట్ మాత్రం కత్రినా హాట్ లెగ్స్. బాలీవుడ్ లో లాంగ్ లెగ్డ్ బ్యూటీస్ లో చాలామందే ఉన్నారు.. శిల్పా శెట్టి నుంచి.. దీపిక పదుకొనే వరకూ లాంగ్ లెగ్స్ ఉండే బ్యూటీలే. కానీ కత్రినా కైఫ్ కు మాత్రం ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లభిస్తుంది. ఇంటర్నేషనల్ బ్యూటీ కావడంతో ఆ హై హీల్స్ వేసుకొని ఎంతో న్యాచురల్ గా కనిపిస్తోంది. అన్నట్టు ఈ బ్యూటీ దగ్గరకు ప్రస్తుతం ఒక ఇంగ్లీష్ మూవీ స్క్రిప్ట్ వచ్చిందట. అంతా సవ్యంగా జరిగితే ఇంగ్లీష్ మూవీలో నటిస్తుందని టాక్. ఇది కాకుండా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చిత్రం ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer