బ్యూటీ క్వీన్ ఫ్రమ్ హెవెన్

0

బాలీవుడ్ లో ఓ పదేళ్ళ నుంచి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఒక బ్యూటీ పేరు చెప్పమంటే చాలా కష్టం. ఒక్క కత్రినా పేరు తప్ప మరో హీరోయిన్ పేరు చెప్పలేం. కత్రినా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పదహారేళ్ళయింది. మొదటి మూడు నాలుగేళ్ళు సాధారణమే కానీ ఆ తర్వాత టాప్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. 2007.. 2008 లో వరస హిట్లతో దుమ్ము లేపింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకూ అదే స్టాండర్డ్ మెయింటెయిన్ చేస్తూ వస్తుంది. మధ్యలో ఎంతోమంది హీరోయిన్లు వచ్చారు.. కొందరు కనుమరుగయ్యారు కానీ కత్రీనా మాత్రం అలానే ఉంది. ఈమధ్య ‘భారత్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.

సోషల్ మీడియాలో కత్రినా చాలా యాక్టివ్. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అప్డేట్స్ లేకపోతే ఒక హాటు ఫోటోను అలా వదులుతుంది. నెటిజన్లు ఒడ్డున పడ్డ చేపల్లా విలవిలలాడాల్సిందే. తాజాగా తన ట్రెండ్ ను కొనసాగిస్తూ మరో ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. అయినా కత్రినాకు క్యాప్షన్ తో పనేముంది. కత్రినా ఫోటోనే వెయ్యి క్యాప్షన్లకు సమానం. ఈ ఫోటోలో కత్రిన బ్రౌన్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ షార్ట్ గౌన్ ధరించి ఒక బిల్డింగ్ టెర్రేస్ పై నిలుచుని పోజిచ్చింది. అందమైన భామను టచ్ చేస్తున్న అల్లరిగాలికి ఎగురుతున్న ముంగురులను అలా చేత్తో సవరించుకుంటూ.. పనిలో పనిగా స్టైలిష్ గా నవ్వుతూ ఒక బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మరో ఫోటోలో జస్ట్ అలా కూర్చుని ఉంది. కొన్ని అందాలను వర్ణించాలంటే మాటలు సరిపోవు. అలాంటి అందం కత్రినాది.

అయితే లక్కీగా నెటిజన్ల లో చాలామంది కళాపోషకులే. ఈ ఫోటోను పోస్ట్ చేసి జస్ట్ మూడు గంటలే అయినా ఆరులక్షలకు పైగా లైకులు కొట్టారు. నాలుగు వేలకు పైగా కామెంట్లు పెట్టారు. “హాటర్ దేన్ సన్ కూలర్ దేన్ మూన్”.. “బ్యూటీ క్వీన్ ఫ్రమ్ హెవెన్”.. “రియల్ మీనింగ్ ఆఫ్ బ్యూటీ”.. “ఎవర్ గ్రీన్ బ్యూటీ” అంటూ కొందరు తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer