కత్రిన బ్రాండ్.. నయన్ ప్రమోషన్

0

స్నేహం కోసం ఏదైనా చేస్తారు. కమర్షియల్ గా కలిసొస్తే దేనికైనా సై అనేస్తారు! ఈ రెండు కోణాల్లోనూ కత్రినతో నయన్ కి స్నేహం కుదిరింది. అందాల కత్రిన కైఫ్ కార్పొరెట్ బ్రాండ్ కి నయన్ ప్రమోషనల్ సాయం చేస్తోందట. తాను ప్రారంభిస్తున్న బ్రాండ్ కి.. ఉత్తరాదిన కత్రిననే ప్రచారం చేసుకుంటుంటే.. దక్షిణాదిన మాత్రం నయనతార బరిలో దిగుతోంది. ఆ మేరకు ఇరువురి మధ్యా ఒప్పందం కుదిరింది. అంతేనా.. ఇప్పటికే యాడ్ షూటింగ్ కూడా పూర్తవుతోందట.

ఈ ప్రకటన కోసం ఏకంగా నయన్ చెన్నయ్ నుంచి ముంబైకి వెళ్లింది. అందుకు కత్రిన తనకు కృతజ్ఞతలు చెప్పింది. ఇంతకీ కత్రిన పేరుతో ఏ ఉత్పత్తి మార్కెట్లోకి రాబోతోంది? అంటే సౌందర్య సాధనాల్ని.. ఉపకరణాల్ని మార్కెట్లో రిలీజ్ చేయబోతోందిట. ఆ మేరకు వోన్ బ్రాండ్ తో వస్తున్న కంపెనీపై కోట్లాది రూపాయల్ని కత్రిన వెచ్చించింది. ప్రస్తుతం మార్కెటింగ్ విభాగాన్ని అభివృద్ధి చేయడంలో బిజీ.

అన్నట్టు మొన్నటికి మొన్న బాలీవుడ్ లో అత్యంత భారీగా రిలీజైన `సైరా` ప్రమోషన్స్ కి స్ట్రిక్టుగా డుమ్మా కొట్టిన నయన్ ఇలా కత్రిన కోసం అంత దూరం వెళ్లింది. మెగాస్టార్ 300 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఈవెంట్ ఎగ్గొట్టినా అదేమీ కనీస మాత్రానికైనా గుర్తుకు రాలేదు. అయితే అందుకు ముందే ఒప్పందం చేసుకున్న స్టోరీ వేరేగా ఉందిలెండి.

స్టార్ స్టక్ పేరుతో సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తుల రంగంలోనే శృంగార తార సన్నీలియోన్ పెద్ద సక్సెస్ సాధించింది. చాలా మంది అగ్ర కథానాయికలతో పోలిస్తే సన్నీ చాలా తెలివిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టింది. ఆ క్రమంలోనే పలువురు నాయికలు ఇటువైపు చూస్తున్నారు. తాజాగా కత్రిన బిగ్ ప్లాన్ తోనే బరిలో దిగిందని అర్థమవుతోంది.
Please Read Disclaimer