క్యాట్ ఫ్యాషన్ కు సాటి లేనే లేదు

0

బాలీవుడ్ హీరోయిన్లలో భారీ ఫాలోయింగ్ ఉండే బ్యూటీల లిస్టు తీస్తే అందులో కత్రినా కైఫ్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోలతో జోడీ కడుతూ కెరీర్ కొనసాగిస్తున్న సీనియర్ మోస్ట్ హీరోయిన్ కత్రినానే. హీరోయిన్ సీనియరే కానీ ఈ న్యూ జెనరేషన్ హీరోయిన్లకు సోషల్ మీడియా విషయంలో గట్టిపోటీ ఇస్తుంది. ఇన్స్టా గ్రామ్ ను ఆడుకోవడం కత్రినాకు ఉన్న చాలా హాబీలలో ఒకటి.

మిగతా హీరోయిన్లు ఫోటోలు పోస్ట్ చేస్తే ఎప్పుడో ఒకసారి కానీ వన్ మిలియన్ లైక్స్ రావు. అదే కత్రినా ఎప్పుడు ఫోటో పోస్ట్ చేసినా సరే 1.5 మిలియన్ లైక్స్ గ్యారెంటీ. తాజాగా కత్రినా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో కత్రినా డ్రెస్ సూపర్ గా ఉంది. ఫ్యాషన్ అనే పదానికి అర్థం అనుకోవచ్చు. ఛోళి లాంటి వైట్ టీ షర్టు ధరించింది.. దానికి మ్యాచింగ్ గా అదే రంగు లెహెంగా ధరించింది. అ లెహెంపై ఎవిరిథింగ్ అని రాసి ఉంది. ఒక చున్నిని చేతులతో స్టైల్ గా పట్టుకుంది. బుట్టబొమ్మలాగా రౌండ్ గా తిరుగుతూ ఉండగా తీసిన ఫోటో ఏమో కానీ లెహంగా అలా పైకి వచ్చింది.. జుట్టు కూడా ఓ వైపుకు ఉంది. ఈ ప్రపంచంలో ఎంతో మంది హాట్ బ్యూటీలు ఉంటారు కానీ వారిలో సగం మందికి ఫేస్ వ్యాల్యూ ఉండదు. కానీ కత్రినా ఫేస్ చూసి ఖాన్లు కపూర్లే డంగైపోయారు ఇక సాధారణ నెటిజన్లు ఎంత?

ఈ ఫోటోకు 18 గంటల్లోనే 1 మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. కామెంట్లకు లెక్కే లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే పోయినేడాది సల్మాన్ ఖాన్ ‘భరత్’ సినిమాతో ఓ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. త్వరలో ‘సూర్యవంశి’ రిలీజ్ కానుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-