కలర్ ఫుల్ బికినీ.. నైస్ లొకేషన్

0

క్రేజీ ఫాలోయింగ్ ఉండే బాలీవుడ్ బ్యూటీలలో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 15 ఇయర్స్ ఇండస్ట్రీ. హీరోలకు అలా చెప్పుకుంటే ప్లస్ అవుతుందేమో కానే హీరోయిన్లకు మాత్రం కష్టం. అయితే కత్రినా ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ న్యూ జెనరేషన్ హీరోయిన్లతో పోటీ పడుతోంది. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ‘భారత్’ తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అందుకే తన ఇన్స్టా ఖాతాకు 24 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ వారందరినీ మురిపిస్తూ ఉంటుంది.

తాజాగా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కత్రినా మెక్సికో టూర్ లో ఉందట. అక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో తీయించుకున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ జస్ట్ ఒక సీతాకోకచిలుక ఎమోజిని మాత్రం పెట్టింది. ఈ ఫోటోలో కత్రినా ఒక కలర్ ఫుల్ బికినీలో ఉంది. నేపథ్యంలో పారే సెలయేరు.. పచ్చటి చెట్లు ఉన్నాయి. ఇకపై కత్రినా నిలుచున్న చోట ముత్యాలు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలా నవ్వేసింది.. మరి ముత్యాలు రాలి కిందపడతాయి కదా..!

ఈ ఫోటోకు దీపిక పదుకొనే లాంటి సెలబ్రిటీలు లైకులు కొట్టారు. ఒక కామెంట్లకు కూడా ఏం తక్కువ? “ఇంక్రెడిబుల్ బ్యూటీ”.. “కలర్ఫుల్ బికినీ.. నైస్ లొకేషన్”.. “కేట్.. యువర్ బికినీ ఈజ్ హాట్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అక్షయ్ కుమార్ సినిమా ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి.
Please Read Disclaimer