కత్రినా సింపులే కానీ.. అలా చూస్తూ ఉండిపోతారంతే!

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. గతంలో ఒకటి రెండు తెలుగు సినిమాలలో కూడా నటించింది. విక్టరీ వెంకటేష్ నటించిన “మల్లీశ్వరి” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తెలుగుతెరకు దూరమైంది. ఇక అదే సమయంలో బాలీవుడ్లో బిజీ అయిపోయి కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కత్రినా కైఫ్ మొదటి నుండి కూడా అందానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా దుస్తులతో తన అందచందాలను రెట్టింపు చేసుకోవడంలో కత్రినాది అందెవేసిన చేయని చెప్పేయొచ్చు. తనకు నచ్చిన కాస్ట్యూమ్ ఎంత ఖరీదైనా సరే ఈ భామ కొనుగోలు చేసేస్తుందట.

ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న కత్రినా బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అమ్మడు ఆ ఫోటోలో ఎంతో అందంగా స్లిమ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫిట్నెస్ కి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది ఈ అమ్మడు. అందుకే ఎల్లప్పుడూ ఎంతో ఉత్సాహంగా.. అభిమానులను అలరిస్తుంది. ఈ కాలంలో పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వస్తున్నా.. వయసు నాలుగు పదులు దగ్గర పడుతున్నా.. కత్రినా క్రేజ్ మాత్రం కొంచం కూడా తగ్గడం లేదు. సహజమైన అందం ఎక్కడ ఎలా ఉన్నా అందంగానే కనిపిస్తుంది. దానికి మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. కత్తి బేబీ కూడా అలాగే అనిపిస్తుంది. నిజంగా ఆ చిరునవ్వుతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఏం చేస్తాం.. అలా చూస్తూ ఉండటం తప్ప! అంటున్నారు అమ్మడి డై హార్డ్ ఫ్యాన్స్!
Please Read Disclaimer