వోగ్ కోసం బాలీవుడ్ బంగారం

0

బ్యూటీలు చాలామందే ఉంటారు కానీ ఎవర్ గ్రీన్ బ్యూటీలు మాత్రం తక్కువ మంది ఉంటారు. బాలీవుడ్ హాటీ కత్రీనా కైఫ్ ఆ లిస్టులో టాప్ లో ఉంటుంది. సీనియర్ బ్యూటీ అయినా ఇప్పటికీ న్యూ జెనరేషన్ భామలకు పోటీ ఇస్తోంది. సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలతో రెగ్యులర్ గా నెటిజన్లను సతాయిస్తోంది. అందుకే కత్రీనాకు ఇన్స్టాలో భారీగా ఫాలోయర్లు ఉన్నారు.

కత్రినా తాజాగా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘గోల్డెన్ అవర్. వోగ్ నవంబర్ 2019’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోషూట్ లో కత్రినా ధరించిన డ్రెస్ డిజైన్ చేసిన వారు అనైతా ష్రాఫ్ అదజానియా. ఈ ఫోటోలో గోల్డ్.. పింక్.. బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉండే ఒక లాంగ్ జాకెట్ ధరించి ఒక గ్లాస్ కుర్చీపై కూర్చుంది. నలుపు రంగు నెయిల్ పాలిష్.. మెడలో బంగారు దండతో.. ఫేస్ కు పర్ఫెక్ట్ మేకప్ తో ఒక మోడల్ లాగా పోజిచ్చింది. జుట్టును కాస్త చిందరవందరగా వదిలెయ్యడంతో హాట్ అప్పీల్ వచ్చింది. ఈ ఫోటోలో కత్రినా ఎంతో సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. కరెక్ట్ గా చెప్తే ఈ ఫోటో ఒక అల్ట్రా మోడరన్ పెయింటింగ్ లాగా ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్లు తెగ లైక్స్ కొట్టారు. అలా లైక్స్ కొట్టిన వారిలో లస్ట్ భామ కియారా అద్వాని కూడా ఉంది. ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ‘క్యాట్.. నీకు సాటిలేదు’.. ‘ది బెస్ట్ బాలీవుడ్ బ్యూటీ’.. ‘సూపర్ హాట్’ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది.
Please Read Disclaimer