కత్రినా..వారితో కలిసి కే బ్యూటీ అంటోంది!

0

సినిమా స్టార్లు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం చాలా కాలం నుంచే ఉంది. బాలీవుడ్ స్టార్ల విషయం తీసుకుంటే హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా బిజినెస్ లు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. సోనమ్ కపూర్ లాంటి వారు దుస్తుల వ్యాపారంలో ఉన్నారు. సన్నీ లియోన్ కాస్మెటిక్స్ వ్యాపారంలో ఉన్నారు. కత్రినా కైఫ్ కూడా అదే దారిలో కే బ్యూటీ పేరుతో కాస్మెటిక్స్.. పెర్ఫ్యూమ్స్ బిజినెస్ చాలరోజుల క్రితమే మొదలు పెట్టింది.

ఆన్లైన్ ఈ-కామర్స్ పోర్టల్ నైకా వారితో కలిసి కే(Kay) బ్రాండ్ సౌందర్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బ్రాండ్ ను కత్రిన ఎంతో జోరుగా ప్రచారం చేస్తూ పాపులర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈమధ్యే తన ‘కే బ్యూటీ’ మహిళా బృందంతో కలిసి ఒకే రంగు దుస్తులు ధరించి పోజిచ్చింది. ఈ ఫోటోలో దాదాపు 10 మంది ఉన్నారు. అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ జోరు చూస్తుంటే కత్రినా త్వరలోనే తన బ్రాండ్ ను కాస్మెటిక్స్ లో టాప్ రేంజ్ కు తీసుకుపోయేలా ఉంది.

ఇక కత్రినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సూర్యవంశీ’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రల్లో నటించడం విశేషం.




Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-