35 ఏళ్ల గాయని బేబి బంప్ తో చిందులు

0

అమెరికన్ పాపులర్ సింగర్.. సాంగ్ రైటర్.. హోస్ట్ కేటీ పెర్రీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నిరంతరం తనదైన గానాలాపనతో అభిమానుల్ని ఉర్రూతలూగించడం తన ప్రత్యేకత. ఎప్పటికప్పుడు స్టేజ్ షోస్ ఇస్తూ మెస్మరైజ్ చేస్తుంటుంది. తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను ఓలలాడిస్తుంది. తాజాగా బేబీ బంప్ తో ఈ అమ్మడు సెన్సేషన్ క్రియేట్ చేసింది.

తాజా లైవ్ మ్యూజికల్ షోలో క్యాటీ చెలరేగడం హాట్ టాపిక్ గా మారింది. మహిళా క్రికెట్ టీ 20 ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో కేటీ ఫీట్ చర్చనీయాంశమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ స్టేడియంలో ముగిసింది. ఇందులో భారత్- ఆస్ట్రేలియా తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ క్లోజింగ్ కార్యక్రమంలో కేటీ పెర్రీ తన పాటలతో ఆడియెన్స్ ని ఓ ఊపు ఊపారు. అయితే ఉమెన్స్ డే సందర్భంగా ఆమె ధరించిన డ్రెస్సులు ఇక్కడ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ఉమెన్స్ డేని పురస్కరించుకుని ఆ భావాన్ని ప్రతిబింబించేలా కేటీ ఉమెన్స్ సింబల్ తో పింక్ కలర్ గౌను ధరించి సందడి చేసింది. మహిళల్లో ఉత్తేజాన్ని నింపే పాటలతో మైమరపించింది. అంతేకాదు ఇందులో మూడు రకాల డిఫరెంట్ డ్రెస్సులతో ఆమె ఆకట్టుకున్నారు. అన్నింటినిలోనూ కామన్ గా పింక్ కలర్ .. ఉమెన్ సింబల్ తో మురిపించింది.

ఇదిలా ఉంటే ఇందులో ఆమె ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ అందరిని ఆశ్చర్య పరిచింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానని కేటీ ఓపెన్ గా ప్రకటించడం వేడెక్కించింది. అంతేనా.. తనకు బేబీ గాళ్ మాత్రమే కావాలంటూ వేదికపై ముసిముసిగా నవ్వులు కురిపించింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేటీ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అన్నిమాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కేటీ చేసిన డేరింగ్ స్టేట్ మెంట్ కి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ స్టేట్ మెంట్ ఎంతో మందిని ఇన్ స్పైర్ చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే కేటీ ఇలా బేబి బంప్ తో అంత సాహసం చేయడమేమిటి? ర్యాంప్ వాక్ లు.. చిందులు కరెక్టేనా? అంటూ అభిమానులు కంగారు పడ్డారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-