కరణ్ పార్టీ లో ముద్దు గుమ్మల ఝంజాటం

0

హాలీవుడ్ పాపులర్ గాయని కేటి పెర్రీ ముంబైలో లైవ్ కాన్సెర్ట్ కోసం ప్రిపేరవుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్ కి ముందే బాలీవుడ్ ఇలాకా లో కేటీ హంగామా మామూలుగా లేదు. ఓవైపు మీడియా ఇంటరాక్షన్స్ .. మరోవైపు నైట్ పార్టీలు అంటూ బోలెడంత సందడి తో ముంబై హీటెక్కి పోతోంది. ఇక కేటీతో సాన్నిహిత్యం కోసం వెంపర్లాడుతూ పలువురు బాలీవుడ్ స్టార్లు అదే పనిగా తన తో పాటే మత్తెక్కే పార్టీల్లో మునిగి తేల్తున్నారు.

కేటీ కోసం బాలీవుడ్ పూలరంగడు కరణ్ జోహార్ గురువారం రాత్రి అదిరిపోయే పార్టీని ఎరేంజ్ చేశారు. ఈ పార్టీ లో కేటీ తో పాటుగా బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు బోలెడంత రచ్చ చేశారు. ఐశ్వర్యా రాయ్ బచ్చన్- అభిషేక్ బచ్చన్ దంపతులు.. అభిషేక్ సోదరి శ్వేతా బచ్చన్- షాహిద్- మీరా రాజ్ పుత్ జంట.. నేహా ధూపియా- అంగద్ భేడీ దంపతులు ఎటెండవ్వ గా.. అనుష్క శర్మ- ఆలియా భట్- కరిష్మా కపూర్- మలైకా అరోరా- అర్జున్ కపూర్- జాక్విలిన్ ఫెర్నాండెజ్- కియరా అద్వాణీ- సోనాక్షి సిన్హా తదితరులు పార్టీని వేడెక్కించారు. ఈ సెలబ్రేషన్ లో బాలీవుడ్ కొత్తతరం స్టార్లు అనన్య పాండే- షెనయ కపూర్ (సంజయ్ కపూర్ డాటర్) ఈ వేడుక లో పాల్గొన్నారు. ఇక ఈ పార్టీలో కరణ్ స్నేహితురాలు గౌరీఖాన్ .. కాజోల్ దేవగన్ మిస్సవ్వడం ఏదో వెలితి గా అనిపించిందట. ఇక పార్టీలో బాలీవుడ్ ముద్దు గుమ్మలంతా కేటీతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఎంతగా ఎగ బడ్డారో తాజాగా రివీలైన సోషల్ మీడియా ఫోటోల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ఇక కేటీ ముంబై లో అడుగు పెట్టిన ఈ సందర్భం లోనే సౌత్ స్టార్స్ విజయ్ దేవరకొండ- రానా దగ్గుబాటి అక్కడ ప్రత్యక్షమవ్వడం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్ మల్హోత్రా- రాహుల్ ఖన్నా తదితరులతో కలిసి ఆ ఇద్దరూ అక్కడ సందడి చేశారు. ప్రస్తుతం దేవరకొండ హైదరాబాద్ లో కంటే ముంబైలోనే ఎక్కువ గడుపుతుండడంపై ఇటీవల రకరకాల ఊహాగానాలు సాగుతున్న సంగతి విదితమే.
Please Read Disclaimer