బిగ్ బాస్ 2 : శ్యామల పార్టీకి ఫైనలిస్ట్ లు డుమ్మా

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విమర్శలు వివాదాలు కొన్ని మంచి సంఘటనల సమాహారంగా సాగింది. కొందరు పార్టిసిపెంట్స్ ప్రేక్షకులకు బాగా దగ్గర అవ్వగా మరి కొందరు మాత్రం పెద్దగా రిజిస్ట్రర్ కూడా కాలేదు. ప్రేక్షకుల్లో వారికి వచ్చిన క్రేజ్ విషయం పక్కన పెడితే ఒక్కరు ఇద్దరు మినహా అంతా కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిన తర్వాత కూడా పార్టీలు ఫంక్షన్స్ అంటూ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా శ్యామల బర్త్ డే పార్టీ ఆమె ఇంట్లో జరిగింది. ఆ బర్త్ డే పార్టీకి నలుగురు ఫైనలిస్ట్ లలో కేవలం తనీష్ మాత్రమే హాజరు కాగా మిగిలిన ముగ్గురు డుమ్మా కొట్టారు.

కౌశల్ ఇప్పటికే బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కు తాను దూరంగా ఉంటున్నట్లుగా చెప్పకనే చెబుతూ వస్తున్నాడు. షో తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా కౌశల్ కలిసిన దాఖలాలు లేవు. ఒక ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను రన్ చేస్తున్న కౌశల్ ప్రస్తుతం గోవాలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈవెంట్స్ చేయడంతో పాటు అభిమానులను కూడా కలుస్తూ వస్తున్నాడు. కౌశల్ విషయం పక్కన పెడితే మరో ఇద్దరు ఫైనలిస్ట్ లు గీతా మాధురి మరియు టీవీ9 దీప్తిలు కూడా శ్యామల బర్త్ డే పార్టీకి హాజరు కాలేదు.

బిగ్ బాస్ 2 కు శ్యామల – గీతా మాధురి – దీప్తి లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ముగ్గురు మంచి స్నేహితులుగా కూడా మారారు. ఈ ముగ్గురు చివరి వరకు కూడా చాలా స్నేహంగానే కనిపించారు. మరి శ్యామల బర్త్ డేకు వీరిద్దరు ఎందుకు రాలేదు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. దీప్తి విజయవాడలో ఉంది కనుక రాలేదేమో అని కొందరు అంటున్నారు మరి గీత మాధురి హైదరాబాద్ లోనే ఉంటుంది కదా మరి ఆమె ఎందుకు రాలేదు. ఏదో ఈ ముగ్గురి మద్య జరిగిందని షో ముగిసిన తర్వాత ఆ ముగ్గురి మద్య విభేదాలు వచ్చాయేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లేకున్నా కూడా శ్యామల బర్త్ డేకు తనీష్ – సామ్రాట్ – కిరీటీ – అమిత్ – పూజా – తేజస్వి – దీప్తి సునయన – భానుశ్రీలు హాజరు అయ్యారట. పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్లుగా వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Please Read Disclaimer