దేవరకొండ మెలోడీస్ కీలుగుర్రం

0

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతో నిరాశ పర్చిన ఆనంద్ రెండవ సినిమాను సైలెంట్ గా పూర్తి చేశాడు. భవ్య క్రియేషన్స్ లో వినోద్ దర్శకత్వంలో రూపొందిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమా విడుదలకు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా విడుదల తేదీ కూడా వచ్చేసింది. ఈనెల 20వ తారీకున అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా నుండి కీలుగుర్రం అనే పాటను యూనిట్ సభ్యులు తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

అనురాగ్ కులకర్ణి.. అగస్తి.. రమ్య బెహరా పాడిన ఈ పాటకు స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందించాడు. హీరో పాత్రను తెలియజేసే విధంగా మరియు కథను కూడా ఇందులో చెప్పే విధంగా సాగింది. ఒక మద్య తరగతి కుర్రాడు ఎలాంటి జర్నీని కొనసాగించాడు. అతడి పట్ల జనాలు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది ఈ పాటలో చెప్పారు. మాస్ తో పాటు మెలోడీ టచ్ తో సాగిన ఈ పాట ప్రేక్షకుల్లో పర్వాలేదు అన్నట్లు టాక్ ను దక్కించుకునే అవకాశం ఉంది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో ఆనంద్ సక్సెస్ దక్కించుకుంటాను అనే నమ్మకంను కలిగి ఉన్నాడు. థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీ రిలీజ్ కు సిద్దం అయిన ఆనంద్ దేవరకొండ సక్సెస్ ను దక్కించుకునేనా చూడాలి.