కూతురి కోసం సునీత పాట్లు!

0

డాక్టర్ కూతురు డాక్టర్ అవ్వడం – యాక్టర్ కుమార్తె కూడా యాక్టరే అవ్వడం చూస్తున్నదే. ఇప్పుడు సింగర్ కుమార్తె సింగర్ కాకుండా ఉంటుందా? అందుకే స్టార్ సింగర్ సునీత డాటర్ శ్రేయా కూడా సింగరే అవ్వడం – రంగుల ప్రపంచంలో పెద్ద స్థాయికి ఎదగాలని కలలుగనడం యువతరంలో హాట్ డిబేట్ అయ్యింది. శ్రేయా ఎంట్రీ అదుర్స్. అది కూడా నాగచైతన్య – మైత్రి మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో తనకు అవకాశం దక్కింది.

`సవ్యసాచి`లో ఓ మెలోడీ సాంగ్ ని ఆలపించింది సునీత డాటర్ శ్రేయా.. ఈ పాటను నిన్నటి సాయంత్రం `సవ్యసాచి` ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ లైవ్ లో ఆలపించి మంచి మార్కులే వేయించుకుంది. శ్రేయా లుక్.. హస్కీ వాయిస్.. స్టేజ్ అప్పియరెన్స్ యువతరానికి నచ్చింది. మామ్ సునీత అంత గ్రేసు – స్పీడు ఉన్నాయన్న ప్రశంసలు దక్కాయి. శ్రేయా వాయిస్ లోనూ బోలెడంత గమ్మత్తు ఉందన్న మెప్పు యువతరం నుంచి వచ్చింది.

చాలా చాలా చూసా ఇప్పటికే.. ప్లీజ్ డోంట్ మైండ్.. చూసి చూసి చూడనట్టు వదిలేసెయ్.. లవ్ ఈజ్ బ్లైండ్ .. అంటూ అద్భుతంగా ఆలపించింది. అనంత శ్రీరామ్ రాసిన పాటను హైమత్ తో కలిసి ఆలపించింది. సునీతకు కెరీర్ పరంగా అన్నిరకాలా సాయపడిన మరకతమణి ఎం.ఎం.కీరవాణి తన డాటర్ శ్రేయాను గాయనిగా పరిచయం చేస్తున్నారు. లైవ్ లో శిష్యురాలి పెర్ఫామెన్స్ వీక్షిస్తూ కీరవాణి మైమరిచిపోయారంటే శ్రేయా మెప్పించిందనే దీనర్థం. పెర్ఫెక్షన్ కి మారు పేరు సింగర్ సునీత. అంత పెర్ఫెక్షన్ తో శ్రేయా రాణిస్తుందనే ఆకాంక్షిద్దాం. నవతరం గాయనికి ఆల్ ది బెస్ట్.
Please Read Disclaimer