సుమంత్ ఎక్స్ గాళ్.. ఆ పెళ్లిలో ప్రత్యక్షం

0

హీరో సుమంత్ ఫిల్మీ లైఫ్ .. వ్యక్తిగత జీవితం గురించి తెలిసిందే. అందాల కథానాయిక కీర్తి రెడ్డిని పెళ్లాడి అటుపై విడిపోయిన సంగతి విదితమే. అయితే విడాకుల తర్వాతా ఆ ఇద్దరి స్నేహం కొనసాగుతోంది. ఆ సంగతిని సుమంత్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్లలో సుమంత్ – కీర్తి కలుస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అకేషన్ ఇది.

కీర్తి రెడ్డి .. మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డికి కజిన్. కీర్తి రెడ్డి సోదరుడికి శిల్పా భార్య. అందుకే ఆ ఇద్దరూ చాలాసార్లు రకరకాల ఫంక్షన్లలో కనిపించి సందడి చేశారు. శిల్పారెడ్డికి అక్కినేని కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. అలాగే సుమంత్ కూడా ఈ సంగతిని పలుమార్లు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఇక కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చాక కూడా సుమంత్ తన స్నేహాన్ని కొనసాగించడానికి శిల్పాతో ఉన్న స్నేహానుబంధం ఒక కారణం.

తాజాగా శిల్పారెడ్డి తన సోషల్ మీడియాల్లో తమ కజిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశారు. వీటిలో కీర్తి రెడ్డి- శిల్పారెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు రివీలయ్యాయి. అలాగే ఈ పెళ్లి వేడుకకు సుమంత్ కూడా అటెండయ్యారని ఫోటోల్ని బట్టి తెలిసింది.
Please Read Disclaimer