ఇలా అయితే మహానటి కెరీర్ కి ఇబ్బందే…!

0

కీర్తి సురేష్.. ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమై ‘నేను లోకల్’ సినిమాతో ఇక్కడ స్థిరపడిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ పేరు చెప్పగానే సినీ ప్రేక్షకులకు ‘మహానటి’ సినిమా గుర్తుకు వచ్చే విధంగా ఆ పాత్రలో జీవించేసింది. అంతేకాకుండా అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డును కూడా అందుకుంది. కాగా తమిళ్ లో పెద్ద పెద్ద స్టార్లతో నటించిన కీర్తి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు.. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలలో యాక్ట్ చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్లో తన ఫాలోవర్స్ తో ముచ్చటించిన కీర్తి మహేష్ సినిమాలో నటిస్తున్నట్లు కంఫర్మ్ చేసింది.అయితే ఈ సినిమా రిజల్ట్ మీదే టాలీవుడ్ లో కీర్తి ఫ్యూచర్ ఢిపెండ్ అయ్యుందని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె ‘పెంగ్విన్’ లాంటి సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ వస్తుండటమే అంటున్నారు సినీ అభిమానులు. నిన్న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజైన ‘పెంగ్విన్’ కి అన్ని భాషల నుంచి నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ సినిమా చూసినవారు ‘మహానటి’తో వచ్చిన క్రేజ్ ని కీర్తి తన ‘పెంగ్విన్’ సినిమాతో చాలా వరకు డ్యామేజ్ చేసుకున్నట్లే అని అంటున్నారు. కెరీర్ బాగున్న టైమ్ లో ‘పెంగ్విన్’ లాంటి స్టోరీ చేయకుండా ఉండాల్సిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

అంతేకాకుండా ఛేంజ్ ఓవర్ లేకుండా కంటిన్యూగా వుమెన్ సెంట్రిక్ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంతో కీర్తి కెరీర్ ని దెబ్బతీసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖీ’ ‘రంగ్ దే’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే సూపర్స్టార్ రజనీకాంత్ ‘అన్నాతే’ మరియు మోహన్ లాల్ ‘మరక్కార్ : అరబికదలింటే సింహం’ సినిమాల్లో కూడా నటిస్తోంది
Please Read Disclaimer