మహానటి మేకోవర్ – టీజర్ టాక్

0

ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మహానటికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యింది. దీన్ని రివీల్ చేస్తూ ఇందాకో వీడియో టీజర్ ని రిలీజ్ చేశారు. మిస్ ఇండియా గా మహానటి రాబోతున్న విషయాన్ని ఇందులో ప్రకటించారు. యుఎస్ బ్యాక్ డ్రాప్ లో కాలిఫోర్నియా నగరంలో జరిగే కథగా రూపొందిన మిస్ ఇండియాకు నరేంద్ర నాథ్ దర్శకుడు. 118తో మొదటి సినిమాతోనే సక్సెస్ బోణీ కొట్టిన మహేష్ ఎస్ కోనేరు నిర్మాత.

అల్ట్రా మాడరన్ అమ్మాయిగా స్టైలిష్ లుక్స్ తో కీర్తి సురేష్ ఆదరగోట్టింది. మరి టైటిల్ చూస్తేనేమో మిస్ ఇండియా అని పెట్టారు. విజువల్స్ చూస్తే మొత్తం అమెరికానే కనిపిస్తోంది. మరి కథలో ఏదైనా ఎపిసోడ్ అక్కడ జరుగుతుందా లేక టైటిల్ లో ఏదైనా ట్విస్ట్ ఉందా ప్రస్తుతానికి సస్పెన్స్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిస్ ఇండియా టీజర్ ని బాగా ఎలివేట్ చేసింది. మంచి బీట్స్ తో హీరొయిన్ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేసేలా సాగింది.

ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయని మిస్ ఇండియాలో కీర్తి సురేష్ చుట్టే కథ తిరుగుతుందని సమాచారం. మహానటి తర్వాత తెలుగు స్ట్రెయిట్ మూవీస్ బాగా తగ్గించేసి కోలీవుడ్ కు పరిమితమైపోయిన కీర్తి చేస్తున్న తెలుగు సినిమా ఇదే. డానీ – వంశీ సంయుక్తంగా ఛాయాగ్రహణం అందిస్తున్న మిస్ ఇండియాలో నవీన్ చంద్ర – జగపతి బాబు – రాజేంద్ర ప్రసాద్ – నరేష్ – నదియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home