మహేష్ కోసం రూపం మార్చేస్తున్న మహానటి

0

పాత్ర స్వభావానికి తగ్గట్టు ఫిజికల్ గా రూపురేఖల్లో మార్పు తేవడం ఆర్టిస్టులకు చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మన స్టార్లు ఎంతో కమిట్ మెంట్ తో ఉంటారు. ఇంతకుముందు కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీ కోసం సన్నజాజి రూపానికి షిఫ్టయ్యింది. మహానటి లుక్ కి పూర్తి భిన్నమైన రూపంతో సర్ ప్రైజ్ చేసింది. అయితే ఆ రూపం అభిమానులకు అస్సలు నచ్చలేదు. మరీ జీరో సైజ్ కోసం తిండి మానేసిందా? అన్న కామెంట్లు వినిపించాయి. మరీ అంత లీన్ గా పేల్ గా మారిపోవడం విమర్శలకు తావిచ్చింది.

అందుకే ఇప్పుడు `సర్కార్ వారి పాట` కోసం ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా కీర్తి తన రూపం మార్చుకుంటోందని తెలుస్తోంది. తన పాత్ర కోసం కొంత బరువు పెరగాలని పరశురామ్ కోరారట. దీంతో కీర్తి బరువు పెరగడంపై దృష్టి సారించిందని తెలిసింది.

ఈ చిత్రం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కాస్టింగ్ ఎంపిక కొనసాగుతోంది. అమెరికా నేపథ్యంలో భారీ షెడ్యూల్ ని తెరకెక్కించాల్సి ఉంటుంది. ఈ లోగానే కీర్తి తన రూపాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. మహానటి ఈసారి ఎలాంటి లుక్ కి మారుతుంది? అన్నది వేచి చూడాలి.