ఫస్ట్ లుక్: మైదానంలో మహానటి

0

ఇటీవలే మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. మైదాన్ పేరుతో దర్శకుడు అమిత్ శర్మ రూపొందిస్తున్న బయోపిక్ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మైదాన్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ తరహాలో అనిపించే పోస్టర్ ని కీర్తి సురేష్ తన ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. కాకపోతే యాక్టర్స్ లుక్స్ ఎవరివి ఇందులో రివీల్ చేయలేదు. మైదాన్ 1950-60 దశకాల మధ్య జరిగే కథ.

సుప్రసిద్ధ హైదరాబాద్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పాత్రను హీరో అజయ్ దేవగన్ చేస్తున్నాడు. అప్పట్లో ఇండియాలో ఫుట్ బాల్ ఆటకు స్వర్ణ యుగంగా భావించే టైంలో జరిగిన నిజ జీవిత సంఘటనలు ఆధారంగా ఇది రూపొందుతోంది. క్రికెట్ ప్రాబల్యం పెరగకముందు భారతదేశంలో ఫుట్ బాల్ క్రీడకు ఎంత ఆదరణ ఉండేదో ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపబోతున్నారు ఇప్పుడీ ప్రాజెక్ట్ పట్ల కీర్తి సురేష్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఖచ్చితంగా మరో పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకం తనలో కనిపిస్తోంది.

గత ఏడాది వచ్చిన బధాయీ హో తో నేషనల్ అవార్డు సంపాదించి పెట్టిన అమిత్ శర్మ మైదాన్ స్క్రిప్ట్ మీద చాలా కాలం వర్క్ చేశాడు. అయితే కీర్తి సురేష్ పాత్ర ఏంటనే సంగతి బయట పెట్టలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం తను టీనేజ్ నుంచి మధ్యవయస్కురాలిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తుందట. ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉన్న పాత్ర కావడంతో మహానటినిచూసిన అమిత్ శర్మ మరో ఆలోచన లేకుండా కీర్తిని సంప్రదించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడీ పాత్ర ద్వారా కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో జెండా ఎగరవేస్తుందో వేచి చూడాలి.
Please Read Disclaimer