కీర్తి సురేష్ నెక్ట్స్ సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుందా…?

0

‘మహానటి’ కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ మూవీ ఇటీవల ప్రముఖ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు సమర్పించిన ‘పెంగ్విన్’ కేవలం కీర్తి సురేష్ క్రేజ్ ని వాడుకొని ఓటీటీలో రిలీజ్ చేశారని చెప్పవచ్చు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టిందని సమాచారం. ఈ క్రమంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో సినిమా కూడా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితులు సమిసిపోయి ఆగస్ట్ కి అంతా సద్దుమణుగుతుందని అందరూ అనుకున్నారు. అందుకే ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసి షూటింగ్స్ కి పర్మిషన్ తెచ్చుకున్నారు.

కానీ తాజాగా ఈ మధ్య ఇండస్ట్రీ వ్యవహారాల్లో ముందుండి నడిపిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సైతం ఇప్పుడప్పడే కరోనా ప్రభావం తగ్గే అవకాశం లేదని అనడంతో అందరూ ఒక అవగాహనకు వచ్చేసారు. అలానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా కరోనా ఎంటర్ అవడంతో సినీ పెద్దలంతా షూటింగ్స్ వాయిదా వేస్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లు సమచారం. ఇక థియేటర్స్ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పట్లే ఓపెన్ అవ్వవు అని క్లారిటీకి వచ్చేసారు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా ఇప్పుడప్పుడే జనాలు థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసేలా లేరని అర్థం అయిపోయింది. ఇటీవలే తెరిచన మాల్స్ కి కూడా రావడానికి జనాలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. దీంతో ఇండస్ట్రీలోని పలువురు ఇప్పటి వరకు తమ సినిమాల్ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని భావించినప్పటికీ ఇలాంటి కారణాలతో ఓటీటీకే మొగ్గుచూపాలని చూస్తున్నారట.

ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ నటించిన ‘మిస్ ఇండియా’ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 17న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల కుదరలేదు. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ‘మిస్ ఇండియా’ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేష్ కోనేరు నిర్మించారు. నరేంద్రనాథ్ తరుణ్ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో జగపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నదియా కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి యూఎస్ నుంచి ఫైనాన్స్ వస్తుందట. కాకపోతే అక్కడ ఇన్వెస్టర్లు పరిస్థితి కూడా బాగోకపోవడంతో ఈ సినిమాని ఎలాగోలా మార్కెట్ చేసుకుని అందరికి సెటిల్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer