షార్ప్ షూటర్ గా కీర్తి.. గుడ్ లక్ సఖీ

0

మహానటి చిత్రంతో కీర్తి సురేష్ పాపులారిటీ జాతీయ స్థాయికి ఎదిగింది. సావిత్రి పాత్రకు కీర్తిని తప్ప వేరొకరిని ఊహించుకోలేం అంటూ కితాబిచ్చారు క్రిటిక్స్. ఆ తర్వాత కీర్తి కెరీర్ గురించి తెలిసిందే. సెలెక్టివ్ గా నటిస్తోంది. అటు బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తున్న కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కమిటవుతోంది.

ఇప్పటికే రెండు నాయికా ప్రధాన చిత్రాలకు సంతకాలు చేస్తే వాటిలో ఒకదానికి `మిస్ ఇండియా` అనే టైటిల్ ని ఖరారు చేశారు. తాజాగా దీపావళిని పురస్కరించుకుని నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న వేరొక చిత్రానికి `గుడ్ లక్ సఖీ` అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. ఇది క్రీడా నేపథ్యం ఉన్న సినిమా. కీర్తి ఇందులో షూటర్ పాత్రలో కనిపించనుంది. అందుకు తగ్గట్టే గుడ్ లక్ అంటూ టైటిల్ లోనే క్రీడా స్పిరిట్ ని రగిలించారు. ఇటీవల కీర్తి సురేష్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో ఆది పినిశెట్టి- జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.