కీర్తి కూడా ఆ హీరోయిన్ బాటలో రిస్క్ చేస్తుందా..?

0

సౌత్ సినీ ఇండస్ట్రీలో మహానటి సినిమాతో తన నట విశ్వరూపాన్ని నిరూపించుకుంది కీర్తి. అప్పటినుండి తను మిగిలిన హీరోయిన్స్తో పోలిస్తే ప్రత్యేకం అయింది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసింది కీర్తి. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే కీర్తి సురేష్ మాత్రమే అనేంతలా జీవించేసింది. మహానటి తర్వాత కీర్తితో సినిమాలు చేయడానికి అన్నీ ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు అందరూ క్యూ కట్టారు. కీర్తి మాత్రం కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటుంది. అయితే కీర్తి రాను రాను మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే లైన్ లో పెట్టింది. మహానటి తర్వాత కీర్తి నుండి సోలోగా పెంగ్విన్ సినిమా విడుదల అయింది.

తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సినిమా తర్వాత కీర్తి చేతిలో మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ.. సినిమాలు లైన్ లో ఉన్నాయి. కీర్తి కూడా కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాల చక్రంలో ఇరుక్కుంటుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మహానటి.. పెంగ్విన్.. మిస్ ఇండియా.. గుడ్ లక్ సఖీ సినిమాలు అదే కోవకు చెందినవి. గతంలో అనుష్క శెట్టి కూడా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అరుంధతి చేశాకే స్టార్డం సాధించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమా అనుష్కకి గొప్ప పేరుతో పాటు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత అనుష్క వేదం.. పంచాక్షరీ.. రీసెంట్ గా భాగమతి సినిమాలు తీసి ఆకట్టుకోలేక పోయింది.

కానీ ఆమె ఆ కోవలో నుండి బయటికి వచ్చాకే సూపర్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం నిశ్శబ్దం కూడా అదే కోవలో రాబోతుంది. మరి కీర్తి కూడా అనుష్క బాటలో నడుస్తుందేమో అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్తే అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే గ్లామరస్ రోల్స్ కూడా చేసింది. కానీ కీర్తి గ్లామర్ రోల్స్ చేయనని చెప్పింది. అలాంటప్పుడు ఆ జోనర్ వీడి కాస్త హీరోల పక్కన రోల్స్ కూడా చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం కీర్తి చేతిలో నితిన్ హీరోగా రంగ్ దే.. మహేష్ బాబు హీరోగా ‘సర్కారు వారి పాట’ సినిమాలు ఉన్నాయి. జాగ్రత్త పడితే ఎందుకైనా మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Please Read Disclaimer